Warangal Congress Protest: రాహుల్ గాంధీపై FIR వెంటనే రద్దు చేయాలి.. వరంగల్ క్రాస్‌రోడ్స్‌లో కాంగ్రెస్ భారీ నిరసన
Rahul Gandhi and Modi Amit shah
Warangal Congress Protest: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే రద్దు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్, కాంగ్రెస్ నాయకుడు తుంబూరు దయాకర్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా తుంబూరు దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం గళమెత్తుతున్న రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతును అణిచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, చట్టాలను దుర్వినియోగం చేస్తూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన నియంతృత్వ వైఖరిని మార్చుకుని ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయకపోతే ప్రజల తరఫున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట వీరభద్రం, ఏదులాపురం టౌన్ అధ్యక్షుడు కిశోర్ నాయక్, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కోకపర్తి అనిత, వైస్ చైర్మన్ నవీన్, వివిధ విభాగాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
- Medical Cadre Dispute: తెలంగాణ–ఏపీ వైద్య ఉద్యోగుల కేడర్ వివాదం.. ఇద్దరు వైద్యులకు హైకోర్టులో షాక్.. సుప్రీంకోర్టులో పరిష్కరించుకోవాలని సూచన..
- పట్టభద్రులారా మేల్కోండి.. ఓటుహక్కు పొందండి!
- ‘దశహరా’కు వక్ర భాష్యాలు ఆపండి!
- పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ
- Saddula Bathukamma History: అసలు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారు?..: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే..