Skip to content
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మల్లారెడ్డి రాం రాం..?

Prajapaksham 20 Jul 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మల్లారెడ్డి రాం రాం..?

బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మల్లారెడ్డి రాం రాం..?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భారత రాష్ట్ర సమితికి దూరం అవుతున్నారా…అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మల్లారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైన, తనతో పాటు తన అల్లుడిని కూడా గెలిపించుకొని మల్లారెడ్డి తన సత్తా చాటారు. మల్లారెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను టార్గెట్ అవుతానని భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కొంతకాలం భారత రాష్ట్ర సమితికి ఆయన అంటి ముట్టకుండా వ్యవహరించారు. అయితే మళ్ళీ భారత రాష్ట్ర సమితిలో ఆయన బిజీ అవడం ప్రారంభించడం చూడవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో బిఆర్ఎస్కు పలు జడ్పిటిసిలను గెలిపించడంలో మల్లారెడ్డి తన చక్రం తిప్పారు ఇంతవరకు అంతా బానే ఉంది. కానీ అనూహ్యంగా మల్లారెడ్డి ఇప్పుడు మళ్లీ భారత రాష్ట్ర సమితికి దూరం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన కోడలు ప్రీతి రెడ్డి ఇప్పటికే బిజెపిలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆమె ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఇటీవల కలవడం చూడవచ్చు. అయితే అంతా తూచ్ అని తాను భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతానని మళ్లీ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇటీవల ఎల్బీనగర్ లో జరిగిన యువ సంగ్రామ సభకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు. మల్లారెడ్డి మాత్రం డుమ్మా కొట్టడం ఆయన పార్టీ మార్పు పైన బలంగా వాదన వినిపిస్తోంది. ఇటీవల మళ్ళీ ఆయన పార్టీ కార్యకలాపాలకు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాల్లో సైతం చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే భారత రాష్ట్ర సమితి అనుబంధ సోషల్ మీడియాలో సైతం మల్లారెడ్డిని విమర్శిస్తూ పోస్టులు సైతం కనిపిస్తున్నాయి. దీంతో ఆయన పార్టీ మారడం దాదాపు ఖాయం అని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

ఇదేలా ఉంటే మల్లారెడ్డి తాజాగా తన సన్నిహితులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందు ఒక ప్రతిపాదన పెట్టారని, అందులో తనతో పాటు మొత్తం తన కుటుంబ సభ్యులకు ఐదు టికెట్లను కేటాయించాలని కోరినట్లు సమాచారం వినిపిస్తోంది. మల్లారెడ్డి కోరిన లిస్టులో మల్కాజిగిరి పార్లమెంటు స్థానం కూడా ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల బీజేపీతో కూడా ఇదే బేరం ఆడినట్టు తెలుస్తోంది. అయితే బిజెపి మల్లారెడ్డి ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బిజెపి టికెట్లకు తీవ్రంగా పోటీ ఉంది. మరి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మల్లారెడ్డి కోరికల చిట్టాకు స్థానం దక్కుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే బిజెపి అధిష్టానం నుంచి మల్లారెడ్డికి వచ్చిన గట్టి హామీ ఏంటో అనే చర్చ కూడా అటు రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. మొత్తానికి డైలీ టీవీ సీరియల్ లాగా సాగుతున్న మల్లారెడ్డి రాజకీయ పయనం చివరకు ఎటువైపు వెళుతుందా అని అంతా ఆలోచిస్తున్నారు.

ట్యాగ్‌లు: BRS mla mallareddy Telangana