Rahul Gandhi PM Row: విజయ్ కేబినెట్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరిక..
Rahul Gandhi and Vijay
Rahul Gandhi PM Row: తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి ఎస్. రాజేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికలకు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా TVK అంగీకరించకపోతే రాష్ట్ర కేబినెట్‌లోని కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేస్తారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు విజయ్‌ను భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాల నేపథ్యంలో వచ్చాయి.
Rahul Gandhi PM Row: తమిళనాడులోని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. 2029 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించకపోతే.. కేబినెట్ నుంచి తక్షణమే వైదొలుగుతామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
కన్యాకుమారిలో జరిగిన పార్టీ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి ఎస్. రాజేశ్ కుమార్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. “2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. ఒకవేళ ఈ ప్రతిపాదనకు టీవీకే నిరాకరిస్తే, కేబినెట్‌లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ మంత్రులం వెంటనే రాజీనామా చేస్తాం” అని ఆయన హెచ్చరించారు.
టీవీకే నేతలు తమ అధినేత, సీఎం విజయ్‌ను భవిష్యత్ ప్రధానిగా చిత్రీకరించడమే ఈ విభేదాలకు కారణమైంది. మంత్రి డి. శరత్‌కుమార్, ప్రచార విభాగం కార్యదర్శి ఆధవ్ అర్జున వంటి కీలక నేతలు విజయ్‌ను జాతీయ నాయకుడిగా, దక్షిణాది నుంచి రాబోయే ప్రధాని అభ్యర్థిగా పేర్కొనడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు సాధించిన టీవీకే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ మద్దతును తీసుకుంది. దీంతో ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కు తమిళనాడు మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్‌తో సహా పలువురు నేతలు కాంగ్రెస్ స్పష్టమైన వైఖరికే మద్దతు తెరిపారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నప్పటికీ, ప్రధాని అభ్యర్థిత్వంపై చెలరేగిన ఈ వివాదం నూతన సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వానికి సవాలుగా మారింది.
- Saddula Bathukamma History: అసలు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారు?..: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే..
- Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ విశిష్టత, బతుకమ్మ పేర్చే విధానం, వాడాల్సిన పువ్వులు, నైవేద్యాల పూర్తి వివరాలు..మీ కోసం..
- Dasara Navaratri 7th day: దసరా 7వ రోజు మహాలక్ష్మీ దేవి అలంకారం WhatsApp, Facebook, X లో షేర్ చేసుకునేందుకు టాప్ 30 శుభాకాంక్షల మెసేజెస్..
- Dasara Navaratri 7th Day: నేడు దసరా నవరాత్రుల 7వ రోజు మహాలక్ష్మీ అమ్మవారి అలంకారం… పూజా విధానం, విశిష్టత, నైవేద్యం, వస్త్రం రంగు వంటి విశేషాలు మీకోసం..
- మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ – కావ్య మారన్ కళ్యాణం… తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్ గ్రూప్ ఛైర్మన్ ఆహ్వానం…