Skip to content
జాతీయం వార్తలు

Rahul Gandhi Arrest: పోలీసుల అత్యుత్సాహం.. రాహుల్ గాంధీకి గాయాలు, ముక్కు నుండి కారిన రక్తం…వీడియో వైరల్

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Rahul Gandhi Arrest: పోలీసుల అత్యుత్సాహం.. రాహుల్ గాంధీకి గాయాలు, ముక్కు నుండి కారిన రక్తం…వీడియో వైరల్

Rahul Gandhi Arrest: పోలీసుల అత్యుత్సాహం.. రాహుల్ గాంధీకి గాయాలు, ముక్కు నుండి కారిన రక్తం...వీడియో వైరల్

ప్రధానమంత్రి నివాసం ముందు నిరసన చేపట్టిన ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రముఖ నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.  ఈ సందర్భంగా రాహుల్ గాంధీని అరెస్టు చేస్తున్న వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ అరెస్టు సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఆయన ముక్కులోంచి రక్తం వస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.  దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ ప్రదర్శన అనంతరం, ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకొని ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు. అనంతరం రాహుల్ గాంధీ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఇలా రాశారు: “మోదీజీ, మీకు చేతనైనంత చేయండి, మీ పూర్తి శక్తిని ఉపయోగించండి. విద్యార్థుల న్యాయం కోసం చేసే ఈ పోరాటం ఇప్పుడు ఆగదు.” ఢిల్లీ పోలీసులు తనను అదుపులోకి తీసుకుంటున్నట్లు చూపిస్తూ, ఆయన తన పోస్ట్‌లో పలు ఫోటోలను కూడా పంచుకున్నారు.

ఇండియా కూటమిలోని వివిధ పార్టీల నాయకులు సైతం కాంగ్రెస్‌కు ఈ సందర్భంగా మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్‌కు మద్దతుగా జరిగిన నిరసనలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియా సూలే, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు అఖిలేష్ యాదవ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ, పలువురు ఇతర నాయకులను పోలీసులు ఛత్రసాల్ స్టేడియానికి తీసుకెళ్లగా, ప్రియాంక గాంధీ, ఇతర నాయకులను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల నిర్బంధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి.