Skip to content
జాతీయం › వార్తలు

No Protests Till Diwali: దీపావళి వరకు ఆందోళనలు వద్దు.. పండుగల వేళ కుటుంబాలతో గడపండి.. మద్దతుదారులకు దీప్కే కీలక విజ్ఞప్తి..

jagan 21 Oct 2026 1 నిమిషాల పఠనం జాతీయం
No Protests Till Diwali: దీపావళి వరకు ఆందోళనలు వద్దు.. పండుగల వేళ కుటుంబాలతో గడపండి.. మద్దతుదారులకు దీప్కే కీలక విజ్ఞప్తి..

Who is Abhijeet Dipke: 37 రోజుల్లో బొద్దింకలతో భూకంపం సృష్టించిన యువ కెరటం…ఎవరీ అభిజిత్ దిప్కే..

No Protests Till Diwali: దేశవ్యాప్తంగా యువత ఆందోళనలతో వార్తల్లో నిలుస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) రాబోయే దీపావళి పండుగను పురస్కరించుకుని తమ నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించింది. దీపావళి పండుగ ముగిసే వరకు దేశంలో ఎలాంటి ఆందోళనలు లేదా నిరసన ప్రదర్శనలు చేపట్టబోమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. తమ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న వేలాది మంది యువత ఈ పండుగ సమయంలో ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా, తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని ఆయన కోరారు.

ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీనామాను డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న యువత భద్రతపై వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రతి రోజూ లీగల్ చిక్కులు, ధర్నాలతో అశాంతికి గురవుతున్న వారిలో ఉద్యమకారుల కుటుంబాలే కాకుండా.. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సీజేపీ ముఖ్య నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలాంటి వారి కుటుంబాలు, అంతెందుకు తన స్వంత కుటుంబం కూడా ఉందంటూ ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పండుగ వాతావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా నిరసనలను కొద్దిరోజులు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో పండుగ వేళ రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజీత్‌ దిష్టిబొమ్మలతో పాటు ఏకంగా 30 అడుగుల ‘కాక్రోచ్’ (బొద్దింక) దిష్టిబొమ్మను దహనం చేయడానికి శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ చేసిన ఏర్పాట్లపై అభిజీత్ దీప్కే తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఢిల్లీ కార్యక్రమాల్లో భాగంగా అపరిశుభ్రతకు చిహ్నమైన కీటకాన్ని తగులబెడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ, ఇది తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యేనని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ పేరును అంతర్జాతీయ, జాతీయ మీడియా ముందు ఉచితంగా ప్రచారం (Free Publicity) చేస్తున్నందుకు రామ్‌లీలా కమిటీకి, దానికి మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని దీప్కే వ్యాఖ్యానించారు.