Skip to content
తాజా
పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్..200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌ నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట రూ. వేల కోట్లు దోచుకుంది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ హైలైట్స్.. ఎన్ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట.. రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపాలి.. విశాఖ ఆక్వా కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. భారత కరెన్సీలో మార్పులపై సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన.. త్వరలో ప్లాస్టిక్ నోట్లు వస్తాయా.. హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు సంఖ్య.. భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్..హైకోర్టులో నో రిలీఫ్ .. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై దాడులను ఖండించిన ప్రజాస్వామ్యవాదులు.. సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీవ్ర ఆగ్రహం.. ఐరాస భద్రతా మండలి నుంచి పాకిస్థాన్ ఔట్.. కిర్గిస్తాన్ తొలిసారిగా ఎంట్రీ.. కొత్తగా ఐదు దేశాల ఎన్నిక పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్..200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌ నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట రూ. వేల కోట్లు దోచుకుంది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ హైలైట్స్.. ఎన్ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట.. రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపాలి.. విశాఖ ఆక్వా కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. భారత కరెన్సీలో మార్పులపై సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన.. త్వరలో ప్లాస్టిక్ నోట్లు వస్తాయా.. హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు సంఖ్య.. భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్..హైకోర్టులో నో రిలీఫ్ .. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై దాడులను ఖండించిన ప్రజాస్వామ్యవాదులు.. సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీవ్ర ఆగ్రహం.. ఐరాస భద్రతా మండలి నుంచి పాకిస్థాన్ ఔట్.. కిర్గిస్తాన్ తొలిసారిగా ఎంట్రీ.. కొత్తగా ఐదు దేశాల ఎన్నిక
భారతదేశం వార్తలు

డీకే శివకుమార్ ప్రభుత్వానికి షాక్.. మంత్రి పదవికి రామలింగారెడ్డి గుడ్‌బై..కారణం ఏంటంటే..

Prajapaksham 05 Jun 2026 0 నిమిషాల పఠనం భారతదేశం
డీకే శివకుమార్ ప్రభుత్వానికి షాక్.. మంత్రి పదవికి రామలింగారెడ్డి గుడ్‌బై..కారణం ఏంటంటే..

Karnataka Minister Ramalinga Reddy Resigns Days After Joining Shivakumar Cabinet

కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రివర్గంలో బుధవారం నాడే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. శుక్రవారం ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ లేఖను సమర్పించారు.

ఈ ఆకస్మిక రాజీనామాకు మంత్రిత్వ శాఖల కేటాయింపులో జరిగిన తీరే కారణమని తెలుస్తోంది. గురువారం రాత్రి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 13 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే, తనకు కేటాయించిన శాఖ పట్ల తీవ్ర నిరుత్సాహానికి గురైన రామలింగారెడ్డి ఆ బాధ్యతలను స్వీకరించడానికి నిరాకరించారు. ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆయన బహిరంగంగానే ఆరోపించారు.

తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే డీకే శివకుమార్ తన ఇంటికి వచ్చారని రామలింగారెడ్డి గుర్తుచేశారు. ఆ సమయంలో బెంగళూరు పట్టణాభివృద్ధి (బెంగళూరు డెవలప్‌మెంట్) శాఖను అప్పగిస్తానని స్వయంగా ఆయనే రెండు సార్లు వాగ్దానం చేశారని పేర్కొన్నారు. తాను సీఎంను ఎలాంటి పదవీ అడగకపోయినా ఆయనే స్వచ్ఛందంగా ఆ ఆఫర్ ఇచ్చారని, తీరా సమయానికి తనకు ఇష్టం లేని నీటిపారుదల (ఇరిగేషన్) శాఖను అప్పగించడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో స్పష్టం చేశారు. బెంగళూరు అభివృద్ధి శాఖ కోసమే రామలింగారెడ్డి పట్టుబట్టినప్పటికీ, ముఖ్యమంత్రి ఆ శాఖను ఆయనకు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడమే ఈ వివాదానికి దారితీసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దిగివచ్చి తనకు నచ్చిన శాఖను ఆఫర్ చేసినా, లేదా బెంగళూరు పోర్ట్‌ఫోలియోను కేటాయించినా తాను మంత్రి పదవిని తీసుకునే ప్రసక్తే లేదని రామలింగారెడ్డి తేల్చిచెప్పారు. ఇకపై తాను కేవలం శాసనసభ్యుడిగా (ఎమ్మెల్యేగా) మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే, పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు. ఈ పరిణామం కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను మరోసారి రోడ్డున పడేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *