Trump on Iran War: ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుంది.. ఆయిల్ ధరలు భారీగా తగ్గుతాయన్న ట్రంప్
US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?
Trump on Iran War: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న సైనిక ఘర్షణలు త్వరలోనే ముగియనున్నాయని, ఆ యుద్ధం ముగిసిన మరుక్షణమే ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు అమాంతం కిందకు పడిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో నిర్వహించిన రిపబ్లికన్ పార్టీ ప్రచార సభలో ట్రంప్ ప్రసంగించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు సేకరించకుండా నిరోధించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, అందుకోసం తమ సైన్యం చేపడుతున్న ఆపరేషన్లను పూర్తిగా సమర్థించుకున్నారు.
యుద్ధ ప్రభావం వల్ల చమురు ధరలు పెరిగాయన్న మాట వాస్తవమే అయినప్పటికీ, నిపుణులు అంచనా వేసినంత భయంకర స్థాయిలో పెరగలేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గత అమెరికా ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఇరాన్ అణు ముప్పు ఈ స్థాయికి చేరిందని విమర్శించిన ఆయన, తమ సైనిక చర్యలు త్వరలోనే ముగింపు దశకు చేరుకుంటాయని వెల్లడించారు.
ఇప్పటికే తమ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ ఆధ్వర్యంలో ఇరాన్‌తో ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. అయితే యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలనే తొందరపాటుతో రాజీపడి ఎలాంటి ఒప్పందాలపైనా సంతకాలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ఇరాన్ నుంచి అణు ముప్పును పూర్తిగా తొలగించి, అమెరికా లక్ష్యాలు నెరవేరిన వెంటనే తమ దళాలు వెనక్కి వస్తాయని, ఆ తర్వాత ముడి చమురు ధరలు వేగంగా నియంత్రణలోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.