Iran Revenge List: ఆందోళన కలిగిస్తున్న ఇరాన్ రివెంజ్ లిస్ట్.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ సహా 13 మంది ప్రపంచ నేతలతో టెహ్రాన్ ప్రతీకార జాబితా..
Iran Revenge List: ఆందోళన కలిగిస్తున్న ఇరాన్ రివెంజ్ లిస్ట్.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ సహా 13 మంది ప్రపంచ నేతలతో టెహ్రాన్ ప్రతీకార జాబితా..
Iran Revenge List: పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. టెహ్రాన్ మున్సిపాలిటీకి చెందిన అధికారిక పత్రిక హమ్షాహ్రీ (Hamshahri) ఆన్లైన్ ఎడిషన్‌లో ఒక వివాదాస్పద ఇన్ఫోగ్రాఫిక్ను ప్రచురించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా 13 మంది కీలక విదేశీ నేతలతో కూడిన ఒక ప్రతీకార జాబితాను ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ నాటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసిన కొద్ది రోజులకే ఈ గ్రాఫిక్ వెలుగులోకి రావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తప్పదని.. ఇందుకు బాధ్యులైన వారు తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మోజ్తబా ఇప్పటికే హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్త డిమాండ్ అని.. దీనిని కచ్చితంగా నెరవేరుస్తానని ఆయన స్పష్టం చేశారు.
తన తండ్రి అంత్యక్రియల అనంతరం శనివారం మోజ్తబా ఖమేనీ తన మొదటి బహిరంగ సందేశాన్ని విడుదల చేస్తూ.. ఈ నేరస్థులకు కంటిమీద కునుకు ఉండదని, వారికి ప్రశాంత మరణం లభించదని ప్రతిజ్ఞ చేశారు. తాము టార్గెట్ చేయబోయే వ్యక్తుల జాబితాను సిద్ధం చేసినట్లు సుప్రీం లీడర్ పేర్కొన్నప్పటికీ.. ఆయన ఎవరి పేర్లను కూడా ప్రత్యక్షంగా వెల్లడించలేదు. ఇక హమ్షాహ్రీ పత్రిక ప్రచురించిన ఈ జాబితాను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఆన్లైన్లో విడుదల చేసిన ఈ ఇన్ఫోగ్రాఫిక్లో మోజ్తబా ఖమేనీ ప్రకటనతో పాటు ప్రచురించిన 13 మంది విదేశీ నాయకుల వివరాలు..
డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)
బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని)
కీర్ స్టార్మర్ (బ్రిటన్ ప్రధాని)
మార్కో రూబియో (అమెరికా విదేశాంగ మంత్రి)
పీట్ హెగ్సెత్ (అమెరికా రక్షణ మంత్రి)
ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు)
జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని)
ఫ్రీడ్రిచ్ మెర్జ్ (జర్మనీ ఛాన్సలర్)
ఈ వివాదాస్పద గ్రాఫిక్ కేవలం ఆన్లైన్ వేదికలపై మాత్రమే పబ్లిష్ అయింది. ఆదివారం నాటి పత్రిక ప్రింట్ ఎడిషన్‌లో దీనిని ప్రచురించలేదు. అయినప్పటికీ ఒక సుప్రీం లీడర్ స్థాయి వ్యక్తి నుండి వచ్చిన హెచ్చరికలు.. పత్రికా ప్రకటనల నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు తమ నేతల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే ఆలోచనలో పడ్డాయి.