పూరీ: ఒడిశాలోని పూరీ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం స్టేషన్‌లోని నాలుగో ప్లాట్‌ఫాంలో ఆగి ఉన్న తపస్విని ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులు అప్రమత్తమై, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే ప్రమాదానికి గురైన బోగీల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా దించివేశారు. ఈ ప్రమాదంలో రైలులోని ఎస్-3, ఎస్-4, ఎస్-5 బోగీలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు.
ఆగి ఉన్న రైలులో అగ్నిప్రమాదం
RELATED ARTICLES