16 మంది కాదు… 17 మంది!

ఎంఐఎంకు సహకరించేందుకే 17వ నెంబర్ ప్రకటించిన టిఆర్

ఇంటర్నెట్ డెస్క్/ప్రజాపక్షం : లోక్ ఎన్నికల్లో పోటీచేసే టిఆర్ అభ్యర్థులను గురువారం రాత్రి ఆ పార్టీ ప్రకటించిన విషయం తెల్సిందే. కెసిఆర్ ఎంతో ఆచితూచి, వ్యూహాత్మకంగా వ్యవహరించి మరీ జాబితాను తయారు చేశారు. కాకపోతే 16 మంది సభ్యులను మాత్రమే ప్రకటిస్తారని అనుకుంటే, ఆయన ఏకంగా 17 మందిని ప్రకటించారు. హైదరాబాద్ స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించినందున ఆ స్థానానికి టిఆర్ అభ్యర్థిని ప్రకటించబోరని ముందనుకున్నారు. అయితే ఇలా ప్రకటించడం వెనుక వ్యూహం వుందని టిఆర్ వర్గాలు చెపుతున్నాయి. పరోక్షంగా ఎంఐఎంకు సహకరించడమే దీని ఉద్దేశమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో హిందువులు, ఇతర ముస్లిమేతర ఓట్లను బిజెపికి వెళ్లకుండా అడ్డుకొని, పరోక్షంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని గెలిపించడానికే కెసిఆర్ ఈ ఎత్తుగడ వేసినట్లు సమాచారం. హైదరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ నేత పుస్తె శ్రీకాంత్ అభ్యర్థిత్వం కేవలం డమ్మీయేనని టిఆర్ వర్గాలు చెపుతున్నాయి.

ఇదీ టిఆర్ లోక్ అభ్యర్థుల జాబితా!

నిజామాబాద్ : కల్వకుంట్ల కవిత
మెదక్ : కొత్త ప్రభాకరరెడ్డి
వరంగల్ : పసునూరి దయాకర్
ఖమ్మం : నామా నాగేశ్వరరావు
జహీరాబాద్ : బీబీ పాటిల్
మహబూబ్ : మన్నె శ్రీనివాసరెడ్డి
కరీంనగర్ : బి.వినోద్
ఆదిలాబాద్ : జి.నగేష్
భువనగిరి : బూర నర్సయ్యగౌడ్
నాగర్ : పి.రాములు
మహబూబాబాద్ : మాలోతు కవిత
నల్గొండ : వేమిరెడ్డి నర్సింహారెడ్డి
పెద్దపల్లి : నేతకాని వెంకటేష్
సికింద్రాబాద్ : తలసాని సాయికిరణ్ యాదవ్
మల్కాజ్ : మర్రి రాజశేఖర్
చేవెళ్ల : గడ్డం రంజిత్
హైదరాబాద్ : పుస్తె శ్రీకాంత్

DO YOU LIKE THIS ARTICLE?