US-Iran Tensions: ప్రపంచ మార్కెట్లకు బిగ్ షాక్.. భగ్గుమన్న ముడి చమురు ధరలు.. హార్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత..
Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని తెరవాలంటే ఇరాన్‌తో ట్రంప్ రాజీ పడాల్సిందే
అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం.. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో నౌకాయానంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి.
US-Iran Tensions: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వార్తలు వెలువడటంతో చమురు మార్కెట్లు ఒక్కసారిగా సంక్షోభంలోకి జారుకున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ అక్టోబర్ డెలివరీ ఫ్యూచర్స్ 1.25 శాతం మేర పెరిగి బ్యారెల్‌కు 83.52 డాలర్లకు చేరుకోగా.. యూఎస్ డబ్ల్యూటీఐ సెప్టెంబర్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 1.10 శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు 78.14 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఈ ఆకస్మిక ధరల పెరుగుదలకు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిపై నెలకొన్న అనిశ్చితే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధి గుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకల ప్రయాణాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ ఇరాన్ ఒక ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్‌కు నష్టం కలిగించిన ఇతర దేశాలు తగిన నష్టపరిహారం చెల్లించే వరకు వాటి నౌకలను కూడా ఈ మార్గం ద్వారా ప్రయాణించేందుకు అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ క్రమంలో జలసంధిలో ఓడల రవాణా మార్గాలను క్రమబద్ధీకరించేందుకు ఇరాన్, ఒమన్ దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. లోపలికి వచ్చే నౌకలు ఇరాన్ జలాల గుండా.. బయటకు వెళ్లే నౌకలు ఒమన్ జలాల గుండా వెళ్లేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా సరఫరా ఆందోళనలను మరింత తీవ్రతరం చేసింది. రష్యాలోని రెండు ప్రధాన చమురు శుద్ధి కర్మాగారాలైన యారోస్లావ్ల్/యానోస్ మరియు బాష్నెఫ్ట్‌కు చెందిన నోవోయిల్ సదుపాయాలపై ఉక్రెయిన్ రాత్రికి రాత్రే భారీ దాడులకు తెగబడటంతో ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఏర్పడింది. దీనికి తోడు సౌదీ అరేబియా నుంచి అమెరికా చేసుకునే ముడి చమురు దిగుమతులు జూలై నెలలో 1985 తర్వాత మొదటిసారిగా పూర్తి స్థాయిలో సున్నాకి పడిపోవడం చమురు రవాణా వైవిధ్యంలో వస్తున్న మార్పులను సూచిస్తోంది.
ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉన్న సమస్యలు అతి త్వరలోనే పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించగా.. ఆయన కేవలం నాటకీయ దౌత్యం చేస్తున్నారని టెహ్రాన్ తిప్పికొట్టింది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు, దౌత్య అనిశ్చితి వెరసి గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నింగిని తాకాయి.
- Indiramma Towers: రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం ప్రారంభం..పేదలందరికీ ఇళ్లు అందే వరకు కొనసాగిస్తామన్న మంత్రి పొంగులేటి..
- SIM Card Misuse: SIM కార్డు ఎవరికైనా ఇచ్చే ముందు జాగ్రత్త..దుర్వినియోగం చేస్తే రూ.50 లక్షల జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష..
- Ayodhya Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిరంలో భారీ కుంభకోణం.. 105 సార్లు విరాళాల చోరీ..సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
- YouTubeకు ప్రత్యామ్నాయంగా చైనా Bilibili.. భారత్‌లోకి రాకముందే ఇండియన్ క్రియేటర్ల క్యూ..
- Tank Bund Ganesh Immersion Row: గణేశ్ నిమజ్జనంపై వివాదం.. ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు…. బారికేడ్లు తొలగించిన భాగ్యనగర్ ఉత్సవ సమితి..