Bank Strike Dates 2026: బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఈ తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. కారణం ఏంటంటే..
Bank Strike Dates 2026:
Bank Strike Dates 2026: ప్రధాన డిమాండ్లలో ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు, సవరించిన Performance Linked Incentive (PLI) విధానాన్ని ఉపసంహరించడం, అలాగే పెండింగ్‌లో ఉన్న ఇతర ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఉన్నాయి.
Bank Strike Dates 2026: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మరోసారి దేశవ్యాప్తంగా పోరాటానికి సిద్ధమయ్యారు. వారానికి 5 రోజుల పనిదినాల అమలులో జాప్యం, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల (PLI) విధానంలో కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ తొమ్మిది ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక అయిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మె పిలుపునిచ్చింది. ఆదివారం జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు దశలవారీ ఆందోళనల ప్రణాళికను ఖరారు చేశారు.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 11, 2026 (శుక్రవారం) – 1 రోజు దేశవ్యాప్త సమ్మె. (శని, ఆదివారాలు తోడై బ్యాంకులు వరుసగా మూతపడే ప్రమాదం ఉంది). అలాగే రెండవ విడతలో భాగంగా సెప్టెంబర్ 28 నుండి సెప్టెంబర్ 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె జరగనుంది. మూడవ విడతలో భాగంగా సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26, 2026 నుండి నిరవధిక సమ్మె జరగనుంది.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు:
- వారానికి 5 రోజుల పనిదినాలు (5-Day Banking): మార్చి 8, 2024న జరిగిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో (12th Bipartite Settlement) సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాల అదనపు పనివేళలతో వారానికి 5 రోజుల పనిదినాలకు ఐబీఏ (IBA) అంగీకరించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపి రెండేళ్లకు పైగా గడిచినా ఇంకా ఆమోదముద్ర వేయకపోవడంపై ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
- వివక్షాపూరిత పీఎల్‌ఐ (PLI) విధానం రద్దు: ఆర్థిక శాఖ ప్రతిపాదించిన నూతన పీఎల్‌ఐ విధానం స్కేల్-4 మరియు ఆపై స్థాయి అధికారులకు వారి వ్యక్తిగత పనితీరు ఆధారంగా గరిష్ఠంగా 365 రోజుల బేసిక్ పేను ప్రోత్సాహకంగా అందిస్తోంది. అయితే, స్కేల్-3 వరకు ఉన్న అధికారులు మరియు ఇతర సిబ్బందికి కేవలం 15 రోజుల బేసిక్ పే + డీఏ మాత్రమే కేటాయించడాన్ని యూనియన్లు తప్పుబడుతున్నాయి. బ్యాంకు మొత్తం లాభాలు/పనితీరు ఆధారంగా స్కేల్-7 వరకు అందరికీ సమాన ప్రాతిపదికన ప్రోత్సాహకాలు ఇవ్వాలని యూఎఫ్‌బీయూ డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు మరియు చీఫ్ లేబర్ కమిషనర్ వద్ద పరిశీలనలో ఉంది.
- ఇతర పెండింగ్ సమస్యలు: పెన్షన్ల క్రమబద్ధీకరణ, పెన్షనర్లందరికీ ఒకే రకమైన డీఏ (DA) ఫార్ములా అమలు చేయాలి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలోని బ్యాంకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోకి (OPS) మారే అవకాశం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దౌత్యపూర్వక చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో సేవలు పూర్తిగా నిలిచిపోతాయని యూనియన్లు హెచ్చరించాయి.
- Dussehra 2026 Wishes in Telugu: దసరా శరన్నవరాత్రులు 3వ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి HD Images శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు Whatsapp ద్వారా తెలియజేయండిలా..
- Rahul Gandhi: మోదీ, అమిత్ షా, అదానీలే అసలు నేరస్థులు.. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తే క్షమించే అవకాశం ఉంది: రాహుల్ గాంధీ
- Minister Komatireddy Video: ఏపీలో జగన్ ఓటమిపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు… కుట్రతోనే జగన్ ను ఓడించారు..
- Dasara 3rd Day Wishes: దసరా శరన్నవరాత్రులలో మూడవ రోజైన శ్రీ అన్నపూర్ణా దేవి ఆశీస్సులు దక్కాలని కోరుకుంటే విషెస్ మీకోసం…
- AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. 106 మున్సిపాలిటీల చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి వివరాలివిగో..