Viral Video: బట్టల సబ్బుతో చిన్నారికి కుక్కకాటు గాయాలు క్లీనింగ్….కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం..(Amalapuram Area Hospital)
Amalapuram Area Hospital: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. పిచ్చికుక్క కాటుకు గురైన చిన్నారుల గాయాలను రిన్ సబ్బుతో క్లీన్ చేస్తూ వైద్య సిబ్బంది దొరికిపోయారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Amalapuram Area Hospital: కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తీవ్ర కలకలం రేపింది. పిచ్చికుక్క దాడిలో గాయపడి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన చిన్నారులకు వైద్యం అందించడంలో తీవ్ర నిలకడలేమి, దారుణ పరిణామాలు వెలుగుచూశాయి. కుక్కకాటు తీవ్ర గాయాలను క్లీన్ చేయడానికి బట్టలు ఉతికే ‘రిన్ సోప్’ ఉపయోగిస్తుండటం స్థానికులను, బాధితుల బంధువులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితిని పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ పరిశీలనలో ఈ దారుణ భాగోతం బయటపడింది. బాధితులకు అందుతున్న వైద్య సేవలను చూసి ఆయన తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాణాపాయంలో ఉన్న పిల్లలకు కనీస వైద్య ప్రమాణాలు పాటించకుండా, రిన్ సబ్బుతో గాయాలు కడగడం ఏంటని వైద్య సిబ్బందిని నిలదీశారు. బాధితులకు తక్షణమే మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.