Skip to content
జాతీయం వార్తలు

Viral Video: ఢిల్లీ లాఠీ చార్జ్ వేళ… నెట్టింట రచ్చ చేస్తున్న మోదీ ఏఐ ఫ్లూట్ వీడియో…

Prajapaksham 21 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Viral Video: ఢిల్లీ లాఠీ చార్జ్ వేళ… నెట్టింట రచ్చ చేస్తున్న మోదీ ఏఐ ఫ్లూట్ వీడియో…

ఢిల్లీ లాఠీ చార్జ్ వేళ... నెట్టింట రచ్చ చేస్తున్న మోదీ ఏఐ ఫ్లూట్ వీడియో... ( Image Source: X.com Video Screen Grab)

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో రాజు ఫిడెల్ వాయించుకున్నాడని చరిత్రలో చదువుకున్నాము. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీలో ఉంది అంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. తాజాగా నీట్ ప్రవేశ పరీక్ష లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ నేడు చలో పార్లమెంటుకు పిలుపునిచ్చిన విద్యార్థుల పైన పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అంతర్జాతీయ మీడియా సైతం ఢిల్లీలో జరిగిన ఈ ఘటనను రిపోర్ట్ చేసింది. దేశ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలవబడే భారతదేశం లో విద్యార్థులు తమ డిమాండ్లను శాంతియుతంగా వినిపించుకునే పరిస్థితిలో లేవని అంతర్జాతీయ మీడియా కోడై కూసింది. గత 20 రోజులుగా జంతర్ మంతర్ వద్ద ప్రముఖ విద్యావేత్త సోనం వాన్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం గమనార్హం. ఇక ఈరోజు విద్యార్థులు ముందుగా చెప్పినట్లే పార్లమెంటు ముట్టడి చేయడంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. విద్యార్థులను గొడ్డును బాదినట్టు బాదారు.

అయితే ఢిల్లీ లాఠీ చార్జ్ కు సంబంధించి వీడియోలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇది అంతర్జాతీయంగా నరేంద్ర మోడీ సృష్టించుకున్న ఇమేజిని డ్యామేజీ చేసేలా ఈ వీడియోలన్నీ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో బీజేపీ ఐటీ సెల్ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. బీజేపీ ఐటీ సెల్ అమిత్ మాలవ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కొత్త థియరీ బయటకు తీద్దామని పనిలో నిమగ్నమై ఉన్నారు. మొత్తం ఎకోసిస్టం ఇప్పుడు ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఎలా మలిన పరుద్దామా అని ఆలోచనలో ఉన్నారు. ఓవైపు నరేంద్ర మోడీ తనను తాను యువతరానికి ప్రతినిధిగా చెప్పుకుంటున్నప్పటికీ, ఆయన చేతల్లో మాత్రం ఎక్కడా కూడా పరిస్థితి కనిపించడం లేదు. ఇక తాజాగా ఢిల్లీ లాఠీ చార్జెస్ సందర్భంగా ప్రస్తుతం నెట్టింట ఒక వీడియో రచ్చ చేస్తోంది ఆ వీడియోలో నరేంద్ర మోడీ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే వెనుక వైపు ఢిల్లీలో జరిగిన దమనకాండ దృశ్యాలు ప్రదర్శించారు