న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సమక్షంలో గంభీర్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గంభీర్‌ను ఢిల్లీలోని ఓ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపాలని బిజెపి భావిస్తున్నట్లు ఇప్పటికే ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ నేత ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా గంభీర్ బిజెపిలో చేరతారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాటికి గంభీర్ తాజాగా తెరదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వం నచ్చి తాను బిజెపిలో చేరుతున్నానని, ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం గౌతమ్ గంభీర్ బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై స్పందించేందుకు గంభీర్ ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి, భారత వాయుసేన నిర్వహించిన ఎయిర్ స్ట్రైక్స్, వింగ్ కమాండర్ అభినందన్ భారత్‌కు తిరిగి రావడం లాంటి విషయాల్లో చురుగ్గా స్పందించారు.
బిజెపిలో చేరిన టీమిండియా మాజీ ఓపెనర్
RELATED ARTICLES