ప్రజాపక్షం/హైదరాబాద్ : అందరికి అందుబాటులో ఉండేవిధంగా జి హెచ్ ఎం సి పరిధిలో 150 మొబైల్ రైతు బజార్ల ద్వారా కూరగాయలను విక్రయిస్తున్నట్లు హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. నిర్ధేశిత ధరలకే మొబైల్ రైతు బజార్లలో కూరగాయలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అన్నిప్రాంతాల ప్రజలకు కూరగాయలను అందుబాటులోకి తెచ్చేoదుకు, ప్రతి మొబైల్ రైతు బజారు వాహనం తిరిగే విధంగా షెడ్యూలును, సమయాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు.
నిబంధనలు పాటించని వారికి క్వారంటైన్లకు తరలింపు
విదేశాలనుండి నగరానికి వచ్చిన వారిలో హోం క్వారంటైన్ నిబంధనలు పాటించని 16 మందిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వారిలో కూకట్ పల్లి జోన్ నుండి ఆరుగురు, చార్మినార్ జోన్ నుండి ఐదుగురు, శేరిలింగంపల్లి జోన్ నుండి నలుగురు, ఖైరతాబాద్ జోన్ నుండి ఒక్కరిని ప్రభుత్వ క్వారంటైన్ కు షిఫ్ట్ చేశారు.
150 మొబైల్ రైతు బజార్లు
RELATED ARTICLES