ఆలీవ్‌బోర్డ్ ఉచిత ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభం

ప్ర‌జాప‌క్షం/హైద‌రాబాద్ : కోవిడ్ 19 భయాలు పెరుగుతున్న వేళ, ఆలీవ్‌బోర్డ్ ఇప్పుడు ఘర్ పే కోచింగ్ పేరిట బ్యాంకింగ్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారి కోసం ఉచిత కోర్సును ఆన్‌లైన్‌లో అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌ను విద్యార్థులకు మార్చి 19 నుంచి హిందీ, ఇంగ్లీషు భాషలలో అందుబాటులో ఉంటుంది. దీనిలో వీడియోలు, అత్యున్నత ఫ్యాకల్టీతో లైవ్ ట్యూషన్లు, మాక్ టెస్ట్‌లతో ప్రత్యేకమైన ప్రాక్టీస్ సెషన్లు ఉంటాయి. ఇటీవల విడుదలైన అధ్యయనాల ప్రకారం భారతదేశంలో 4 మిలియన్ల మంది విద్యార్థులు పలు బ్యాంకింగ్ పరీక్షల కోసం ప్రతి సంవత్సరం హాజరవుతున్నారు మరియు ఈ విద్యార్థులు రెగ్యులర్ కోచింగ్ తరగతులకు ఈ పరీక్షలకు సిద్ధం కావడంలో భాగంగా హాజరవుతున్నారు. నేడు భారీ స్థాయిలో ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అకస్మాత్తుగా అంతర్జాతీయ ఆరోగ్య సంక్షోభం ఎదురుకావడంతో ఈ ఇనిస్టిట్యూట్‌లు చాలా వరకూ మూతపడ్డాయి, తద్వారా విద్యార్థులకు భారీ అవకాశాలు లేకుండా పోయాయి.
ఆలీవ్‌బోర్డ్ ఇప్పుడు ఈ విద్యార్థులకు తోడ్పడటానికి ముందుకు రావడంతో పాటుగా పూర్తి ఉచితంగా ప్రత్యామ్నాయ కోచింగ్‌ను అందిస్తుంది. వీరు తమ ట్రైనర్ల నెట్‌వర్క్‌ను వెంట తీసుకురావడంతో పాటుగా ఉచిత తరగతులను అభ్యాసకులకు దేశవ్యాప్తంగా అందిస్తూ బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యేలా తోడ్పడుతుంది. ఈ సమయాన్ని అభ్యాసకులు ఉపయోగించాలని కోరుకుంటున్నాం. మహమ్మారి కరోనావైరస్‌కు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ ఇంటి నుంచి సౌకర్యవంతంగా అభ్యసించనూవచ్చు. ఆలీవ్‌బోర్డ్ ఈ కీలకమైన సమయంలో వీలైనన్ని మార్గాలలో విద్యావ్యవస్థకు మద్దతునందించాలనుకుంటుంది మరియు బ్యాంకింగ్ రంగంలో సత్తాచాటాలనుకుంటున్న ఔత్సాహికులు తమ లక్ష్యం చేరుకునేలా తోడ్పడుతుంది.
ఈ నూతన కోర్సు గురించి అభిషేక్ పాటిల్, సీఈవో, కో-ఫౌండర్, ఆలీవ్‌బోర్డ్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ కాలంలో, రాబోతున్న బ్యాంకింగ్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి మా ప్లాట్‌ఫామ్‌ను విస్తరించాలని కోరుకుంటున్నామ‌ని, ఈ విద్యార్థులకు అవాంతరాలు లేని వేదికను అందించాలన్నది త‌మ‌ లక్ష్యమ‌ని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?