ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ అక్టోబర్ 31 లోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఇంటర్ పరీక్ష ఫీజును ఆన్ ద్వారా (bie.telangana.gov.in) చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు సూచిం చింది. ఎలాంటి భయాందోళనలకు లోను గాకుండా ఫీజులను బోర్డుకు చెల్లించవచ్చని, ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు చెల్లించిన ఫీజుకు తెలం గాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి బాధ్యత వహిస్తుందని పేర్కొంది. పరీక్ష ఫీజు చెల్లింపులో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించినట్లు తెలిపారు.