మల్కాన్గిరి: ఒడిశా మల్కాన్గిరి జిల్లాలో తన తలపై రూ. లక్ష రివార్డు ఉన్న మహిళా మావోయిస్టు పోలీసుల ముందు లొంగిపోయింది. మావోయిస్టు చర్యల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న ఇదే మాది (23) హింస అనర్థమని భావించి లొంగిపోయినట్లు మల్కాన్గిరి ఎస్పి జగ్మోహన్ మీనా తెలిపారు. నిషేధిత సిపిఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ విభాగంలో మాది పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. మావోయిస్టులు అమాయక పౌరులను చంపుతున్నారని, కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఆమె లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మాదికి ఒడిశా ప్రభుత్వం నుంచి పునరావాస పథకం కింద ఆమెకు ఇల్లు నిర్మించి ఆర్థిక సాయం చేస్తామని ఎస్పి తెలిపారు.
మహిళా మావోయిస్టు లొంగుబాటు
RELATED ARTICLES