HomeNewsదేవుని పూజ‌కి ఈ పూల‌నే ఎందుకు వాడుతారో తెలుసా..?

దేవుని పూజ‌కి ఈ పూల‌నే ఎందుకు వాడుతారో తెలుసా..?

ఏదైనా పూజ, పండుగ, శుభకార్యం అంటే ప్రధమ స్థానంలో పూలు ఉంటాయి. పూలను వీటికే కాకుండా ఇంటిని అలంకరించడానికి కూడా వాడతాం. శుభకార్యంలో వాహనం కూడా పూలతో నింపుతాం. పూలకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ సృష్టిలో ఎన్నో రకాల పువ్వులు ఉన్నాయి. కాని వాటిలో కొన్నిటికి కొన్ని వాడతాము. ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకం పూలు ప్రత్యేకంగా వాడతాం. అవేమిటో, ఎందుకో తెలుసుకుందాం.

మందార పూలు…

కాళిమాతకు ఎరుపు రంగు అంటే ఇష్టం. అందుకే మందార పూల‌ను కాళికా దేవికి ప్ర‌తిరూపంగా భావిస్తారు. మందార పూలతో చేసిన దండను ఆ దేవికి వేస్తే ఆమె అనుగ్రహం కలిగి … ధనం, ఆరోగ్యం కలుగజేస్తుంది.

మ‌ల్లె పూలు…

పెళ్లి వేడుకలో వధూవరులకు మల్లెపూల దండ వేస్తారు. అలా మల్లె పూల దండ వారికి వేస్తే…జీవితాంతం అన్యోన్యంగా ఉంటారని నమ్మకం. అంతేకాకుండా శ్రీ‌మ‌హావిష్ణువుకు మ‌ల్లె పూవంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అందుకే ఆ స్వామిని పూజించేందుకు పల్లె పూలు ఎక్కువగా వాడతారు.

చామంతి, బంతి పూలు…

వివాహ స‌మ‌యంలో చామంతి పూల దండలు పెళ్ళికొడుకు, పెళ్లి కూతురికి వేస్తారు. అంతేకాకుండా మండపాన్ని కూడా ఎక్కువగా చామంతి పూలతో అలంకరిస్తారు. దీనికి కారణం ఏమిటంటే చామంతి పూలు, బంతి పూలు స్వచ్చమైన  ప్రేమకు చిహ్నం.

గులాబీలు…

ప్రేమ‌కు, ఆప్యాయ‌త‌కు, అనురాగానికి గులాబీ పూలు నిద‌ర్శ‌నాలుగా నిలుస్తాయి. ఇవి దంప‌తుల మ‌ధ్య అన్యోన్యాన్ని పెంచుతాయి. అందుకే వీటితో దేవుళ్ల‌ను పూజిస్తే దంప‌తుల‌కు శుభం క‌లుగుతుంది. వారి జీవితంలో ఉండే స‌మ‌స్య‌లు పోతాయి. క‌ల‌హాలు లేని కాపురంగా మారుతుంది.

తామ‌ర పూలు…

సృష్టిక‌ర్త బ్ర‌హ్మ‌కు, ఆయ‌న భార్య స‌ర‌స్వ‌తి దేవికి కూడా ఈ పూలంటే ఇష్ట‌మ‌ట‌. అందుకే వారు ఎప్పుడూ తామ‌ర పూల‌పై కూర్చుంటారు. ఈ పూలు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపం. అంతేకాకుండా ఈ పూలంటే సరస్వతీ దేవికి కూడా ఇష్టమట. అందువలన ఈ పూలతో ఆ దేవుళ్ళను పూజిస్తే అంతా మంచి జరుగుతుంది

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments