హైదరాబాద్: బూతు కహానీలు, బూతు డైలాగులు అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా, మంచి రేటింగ్‌తో పాపులర్ అయిన జబర్దస్త్ షో తెలియని తెలుగు వీక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ షో, కంటిస్టెంట్స్ వల్ల కంటే, ఇందులో జడ్జిలుగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు, వెటరన్ హీరోయిన్ రోజా ల వల్ల ఎక్కువ పాపులారిటీ సంపాదించిందనడం నిజం. ఎందుకంటే బోల్డ్‌గా లైవ్లీగా వారు నవ్వే నవ్వులు, చేసే వ్యాఖ్యానాలు, చేసే సూచనలు, వారి కోపతాపాలు షోను చూసే వీక్షకుల్లో ఒక ఆసక్తిని రేకెత్తించాయి.
మల్లెమాల ప్రొడక్షన్స్ వారు సమర్పిస్తున్న ఈ ప్రోగ్రాంలో ఎప్పుడైనా నవ్వులు రాకపోయినా, ఈ జడ్జిల నవ్వే నవ్వు వల్ల వీక్షకులు కూడా నవ్వు తెచ్చుకోవడం కూడా జరుగుతుంటుంది. ఈ ప్రోగ్రాం కంటిసెంట్స్ కూడా తమదైన శైలిలో పడుడున్న శ్రమకు వారికి సినిమా అవకాశాలు, ఇతరత్రా షోల అవకాశాలు వచ్చి మంచి ఆర్జనపరులైపోయారంటే అందులో అసత్యం ఏమీ లేదు. ఈ ప్రోగ్రామ్‌లో కంటిస్టెంట్స్‌కు విధాయకమైన సలహాలు ఇస్తూ అందరిని మెప్పిస్తున్న జడ్జి గా నాగబాబు శైలి ప్రత్యేకం.
అంతేకాదు..ఆయన పలువురు కంటిస్టెంట్స్‌కు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తారనే మంచి మాట కూడా వినబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన జబర్దస్త్ నుంచి కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్టితి రావడమే తాజా వార్త. అలాగని నాగబాబు షో నుంచి తప్పుకోవడం లేదులెండి. పరిస్తితులు అలా వచ్చాయంతే. అసలు విషయం ఏమిటంటే ఒక సినిమా షూటింగ్ నిమిత్తం మూడు నెలల పాటు విదేశాలలో ఉండవలసి రావడమే ఇందుకు కారణం. ఇందువల్లనే నాగబాబు దాదాపు మూడు నెలలుపాటు జబర్దస్త్ కు దూరం కానున్నారట. అంటే దాదాపు 14 వారాలు.. 28 ఎపిసోడ్‌లు. ఈ షో నిర్వాహక మల్లెమాల టీమ్‌కు, నాగబాబును ఎవరితో రీప్లేస్ చేయాలో పాలుపోవడం లేదట. వేరే వాళ్లు వస్తే టీఅర్పిపై ప్రతికూలత ఏమైనా పడుతుందా అని టెన్షన్ పడుతున్నారట.
దీనికి పరిష్కారంగా నాగబాబు గైర్హాజర్ కానున్న ఎపిసోడ్స్ ని ముందే షూట్ చేయలనే ఆలోచనలో ఉన్నారట. సాధ్యమైతే ఇలా చేస్తారట. ఆయన నవ్వులు షూట్ చేసి ఎటాచ్ చేస్తే సరి జబర్దస్ట్ టీమ్ మెంబర్స్ కొందరు సరదాగా వ్యాఖ్యానించడం కొసమెరుపు. అంటే నాగబాబు నవ్వులకు వీక్షకుల్లో ఉన్న క్రేజ్‌కు ఇదొక నిదర్శనం.