ప్రధాని మోడీ ప్రసంగంపై సిపిఐ అసంతృప్తి
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం పట్ల సిపిఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 26 నిమిషాల ప్రసంగంలో పేదల జీవనభృతి కోసం ఆర్థిక ప్యాకేజీ ఎక్కడుందని నిలదీసింది. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం మంగళవారంనాడొక ప్రకటన విడుదల చేసింది. లాక్‌డౌన్ పొడిగింపుపై ప్రధాని ప్రకటన ఊహించిందేనని, కాకపోతే లాక్‌డౌన్ పొడిగింపుతోపాటు జాతి యావత్తూ ఎదురుచూస్తున్న ఆర్థిక ప్యాకేజీని ప్రధాని ప్రకటించి వుండాల్సిందని, వాస్తవానికి మోడీ అసలు విషయాన్ని గాలికొదిలేశారని విమర్శించింది. ఆయన ప్రసంగం తీవ్ర అసంతృప్తికరంగా వుందని పేర్కొంది. అన్ని నిత్యావసర వస్తువులతోపాటు అందరికీ ఉచితంగా పిడిఎస్ పంపిణీ చేయాలని, ఎంఎస్‌ఎంఇ రంగాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నవారికి, సంఘటిత, అసంఘటిత రంగాల్లో కార్మికులందరికీ వేతనాలు, ఉపాధి రక్షణ, కార్మికులందరికీ బీమా, ఉపాధి హామీ కింద వేతనాలతోపాటు కార్మికులందరి ఖాతాల్లో ముందస్తు జీతాలు లేదా కూలీలు ఇవ్వాలని, అందరికీ ఉచితంగా వైద్యపరీక్షలు, ఉచితంగా మందులు ఇవ్వాలని, వీటన్నింటితోపాటు ఒక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని సిపిఐతోపాటు అనిన ప్రతిపక్ష పార్టీలూ, వివిధ రంగాలకు చెందిన నిపుణులు మొదట్నించీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని సిపిఐ గుర్తు చేసింది. అలాగే, కొవిడ్ 19ను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధమయ్యేందుకు ఆరోగ్యరంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని డిమాండ్ చేసింది. రబీ సీజన్‌లో రైతులకు మద్దతుగా నిలవడంతోపాటు వికేంద్రీకరణ విధానంలో ధాన్య సేకరణ కార్యకలాపాలను విస్తరించాలని కోరింది. ఎఫ్‌సిఐ గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని తక్షణమే అవరమైన పేదలకు పంపిణీ చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. బుధవారం విడుదల చేసే మార్గదర్శకాల్లో పైన పేర్కొన్న సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది.
సిపిఐ నేత డాక్టర్ సౌరిబంధుకర్ కన్నుమూత
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : ప్రముఖ సిపిఐ నేత, కార్మికనాయకుడు డాక్టర్ సౌరిబంధుకర్ సోమవారంనాడు భువనేశ్వర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కొంతకాలం క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె వున్నారు. సౌరిబంధుకర్ ర్టీ జాతీయ సమితి సభ్యునిగా, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యునిగా, ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశేష సేవలందించారు. ఆయన మృతి పట్ల సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయి.
సిపిఐ నేత దుష్యంత్ ఓఝా మృతి
సిపిఐ జాతీయ సమితి మాజీ సభ్యులు దుష్యంత్ ఓఝా కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. ఓఝా రాజస్థాన్ సిపిఐ కార్యదర్శిగా, అయిప్సో ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఆయన మృతి పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం, ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రగాఢ సంతాపం తెలిపారు.
Mr. PM, Where is Economic Package for livelihood of the poor?: CPI
The National Secretariat of the Communist Party of India (CPI) issued the following
statement today (on April 14, 2020) terming the PM’s announcement as disappointment:
In his speech to the Nation Prime Minister Modi announced the extension of the lockdown as
expected.
However, the entire nation expected that the Prime Minister would announce an economic package
along with lockdown extension. In fact, he left them in dark and disappointed.
The CPI, other opposition party leaders and experts from all vital sectors have repeatedly urged
upon the government on the urgent need for an economic package, mass free testing, free
medicine, advance salary remittance in the accounts of all working people including wages for
MGNREGA workers, insurance cover for all, wage and job protection for all workers in informal and
formal sectors and also to the workers who have lost their jobs in MSME sectors, universal free
PDS with all essential commodities, etc.
CPI demands more investments in health sector to increase preparedness to face the pandemic
COVID-19. The party also demands expansion of procurement activities in a decentralised manner
and support to farmers for Rabi harvest season.The government should lift the foodgrains from the
FCI godowns and supply them to the needy poor people.
CPI hopes that when the guidelines are announced the issues raised above are given due
consideration.
Comrade (Dr) Souribandhu Kar is No More
The National Secretariat of the Communist Party of India issued the following statement
today (on April 14, 2020) condoling the death former National Council member and
eminent trade union leader Comrade Souribandhu Kar:
Prominent Communist Party of India leader and eminent trade union leader Comrade Dr
Souribandhu Kar passed away on April 13, 2020 at 10 pm. He was under treatment for
sometime at KIMS Hospital, Bhubaneswar. He was suffering from lever siriasis and chronic
bronchitis. Dr. Kar was a national council and state secretariat member of the Communist Party
of India and state general secretary and national vice-president of AITUC. He was 73 years
old.
D Raja, General Secretary, CPI and Amarjeet Kaur, General Secretary AITUC expressed their
deep sorrow and grief after hearing the sad news. Raja expressed condolences on behalf of the
CPI National Council and Kaur paid her condolences on behalf of AITUC. Both the leaders said
that he was a relentless fighter of the working class and we lost a great personality and
crusader at this crucial juncture of the country conveyed and their condolences to the party
state secretary and AITUC state secretary.
He was born in the Dharmasala block under Jajpur district in 1948. He served in Canara Bank,
joined the AIBEA and was elected as the state president of All India Bank Employees Union,
national vice-president of Canara Bank Employees Union and also the state president of AIBEA
being a relentless fighter for the cause of the working class. He was an eminent writer and
received Odisha Sahitya Academy award. He was also a columnist and contributed to different
newspapers and magazines regularly.
Soon after hearing the news of his sad demise, the Red Flag over Bhagabati Bhavan, State
Headquarters of CPI was lowered half mast, it will be kept for three days as a mark of respect to
the departed leader.
He left behind his wife, one daughter and three sons. It is learnt from his family sources that his
elder son Soubhagya Kar will come from Delhi to Bhubaneswar on 15th evening. His body will
be brought to the CPI state office and AITUC office on 15 th April for the party comrades to pay
their last respects to the departed leader.
CPI Condoles Death of Comrade Dushyant Oza
The National Secretariat of the Communist Party of India issued the following
statement today (on April 14, 2020) condoling the death former National
Council member Dushyant Oza:
The National Secretariat of the Communist Party of India expresses its heart-
felt condolences at the demise of Comrade Dushyant Oza, former State
Secretary of the Party in Rajasthan and member of the National Council of the
Party. He is 88 years old. He is survived by his wife, son and three daughters.
Comrade Oza came into active politics from his student days. He also had
worked in All India Youth Federation. Later, he became the Rajasthan State
Correspondent of New Age and continued in that position for long
Comrade Oza dedicated his entire life for the cause of the downtrodden and
poor. He was also a renowned peace fighter and was the national Vice-
President of All India Peace and Solidarity Organisation.
General Secretary of the Party D. Raja conveyed his deep condolences to
Rajasthan party and Comrade Oza’s family members.