హైదరాబాద్: టిఆర్ఎస్ అధినేత కెసిఆర్పై అలుపెరగని పోరాటం చేసిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కారెక్కనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు కెసిఆర్ సమక్షంలో ఒంటేరు టిఆర్ఎస్‌లో చేరబోతున్నారు. ఒంటేరు టిఆర్ఎస్‌లో చేరే విషయాన్ని ఆయన కుమారుడు ధ్రువీకరించారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి 2014లో తెలుగుదేశం తరఫున, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా సిఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓటమి పాలయ్యారు. గత కొద్దిరోజులుగా ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఒంటేరు టిఆర్ఎస్‌లో చేరడంతో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
కారెక్కనున్న ఒంటేరు
RELATED ARTICLES