ముంబయి: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ చరిత్రలు తిరగరాస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 19,000 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ 23 పరుగులు చేసి 19,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. కేవలం 399 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు సచిన్ టెండుల్కర్ 432 ఇన్నింగ్సుల్లో 19,000 పరుగులు చేశాడు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా (433), ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ (444), దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వెస్ కలీస్ (458) టాప్-5లో ఉన్నారు. నాలుగేళ్లుగా విరాట్ అప్రతిహతంగా పరుగులు చేస్తున్నాడు. శతకాలతో చెలరేగుతున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా కఠిన ప్రత్యర్థులపై వారి సొంతగడ్డలోనే శతకాలు సాధిస్తున్నాడు. ఈ తరంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా కీర్తి పెంచుకుంటున్నాడు.
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
RELATED ARTICLES