HomeAdvertorialక్రాన్‌బెర్రీస్‌తో రుచిక‌ర‌మైన వంట‌కాలు

క్రాన్‌బెర్రీస్‌తో రుచిక‌ర‌మైన వంట‌కాలు

థ్యాంక్స్‌ గివింగ్‌ కోసం మీ మెన్యూనే ఇంకా రెడీ చెయ్యలేదా. అయితే ఇంకెందుకు
ఆలస్యం. వెంటనే మొదలుపెట్టేయండి.
థ్యాంక్స్‌ గివింగ్‌ అనేది అద్భుతమైన కాన్సెప్ట్‌. ప్రేమ, ఐకమత్యానికి
ప్రతీక ఇది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ థ్యాంక్స్‌ గివింగ్‌ను వివిధ దేశాల్లో ఎంతో
గొప్పగా జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఈసారి థ్యాంక్స్‌ గివింగ్‌ను యూఎస్‌
క్రాన్‌బెర్రీస్‌తో ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకోండి. మీ పండగలో భాగంగా
మార్చుకోండి. మీ వంటల్ని మరింత టేస్టీగా, రంగులమయంగా చేసుకోండి.
యూఎస్‌ క్రాన్‌బెర్రీస్‌లో విటమిస్‌ సి పుష్కలంగా ఉంది. దీంతో పాటు ఫైబర్‌,
మాంగనీస్‌, విటమిన్‌ ఇ, విటమిన్‌‌ కె, కాపర్‌ మరియు ప్యాంటోథెనిక్‌
యాసిడ్‌ పుష్కలంగా లభిస్తాయి. సో.. ఈ థ్యాంక్స్‌ గివింగ్‌ సందర్బంగా చెఫ్‌
విక్కీ రత్నాని యూఎస్‌ క్రాన్‌ బెర్రీస్‌ నోరూపించే వంటకాలు ఎలా చేసుకోవాలో
మనకు వివరిస్తారు.

1.రెడ్‌ రోజ్‌ నూడిల్స్‌ మరియు క్రాన్‌బెర్రీ పెస్టో
సర్వింగ్‌: 3 పోర్షన్స్‌
కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల ఉడికించిన రెడ్‌ రైస్‌ నూడిల్స్‌

యూఎస్‌ క్రాన్‌బెర్రీ పెస్టో
1 కప్‌ ఎండిన యూఎస్‌ క్రాన్‌బెర్రీస్‌
4 వెల్లుల్లి రెబ్బలు
1 రోస్టెడ్‌ రెడ్‌ బెల్‌ పెప్పర్‌
1 టేబుల్‌స్పూన్‌ రోస్టెడ్‌ జీలకర్ర పౌడర్‌
1 టేబుల్‌ స్పూన్‌ గరమ్‌ మసాలా పౌడర్‌
2 టేబుల్‌ స్కూన్‌ ఆలివ్‌ ఆయిల్‌
1/2 కప్పు ఉడికించిన పాస్తా వాటర్‌
ఉప్పు మరియు మిరియాల పొడి

ఫినిషింగ్‌ కోసం:
1 టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌
4నుంచి 5 చెర్రీ టమాటాలు
1/2 టీ స్పూన్‌ పసుపు
1 టీ స్పూన్‌ రెడ్‌ చిల్లీ పౌడర్‌
1 టీ స్పూన్‌ గరమ్‌ మసాలా
2 టీ స్పూన్‌ యూఎస్‌ క్రాన్‌బెర్రీ పెస్టో

1 టీ స్పూన్‌ తరిగిన కొత్తిమీర
5 నుంచి 6 ఎండిన క్రాన్‌ బెర్రీస్‌

తయారు చేసే విధానం:
1. కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో దాదాపు 6 నిమిషాల పాటు నూడిల్స్‌ని
ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత చల్లార్చి నీటిని తీసేసి నూడిల్స్‌ని విడిగా
పక్కనపెట్టాలి.
2. ఆ తర్వాత మన దగ్గరున్న అన్నింటితో పాటు యూఎస్‌ క్రాన్‌బెర్రీస్‌ను
కూడా కలుపుకుని ఒక పేస్ట్‌లోతయారు చేసుకోవాలి. మళ్లీ మనకు
అవసరం వచ్చేవరకు దాన్ని పక్కన పెట్టాలి.
3. ఒక ప్యాన్‌ తీసుకుని దానిపై ఆలివ్‌ ఆయిల్ వేసి వేడి చేయాలి
4. నూనె వేడి అయిన తర్వాత చెర్రీ టమాటాలు, పసుపు, కారం, గరమ్‌
మసాలా పౌడర్‌ వేసుకుని గ్రేవీగా చేసుకోవాలి.
5. మిశ్రమం గ్రేవీలా చిక్కగా వచ్చేవరకు కలుపుకోవాలి. ఆ తర్వాత పాస్తా
వాటర్‌, యూఎస్‌ క్రాన్‌బెర్రీ పెస్టో వేసుకోవాలి
6. ఉడికిన మిశ్రమాన్ని నూడిల్స్‌లో కలపాలి
7. ఉడికిన తర్వాత దానిపై కొత్తమీర చల్లుకోవాలి
8. ఆ తర్వాత దానిపై యూఎస్‌ క్రాన్‌బెర్రీస్‌ చల్లి వేడివేడిగా సర్వ్‌ చేయడమే

2.యూఎస్‌ క్రాన్‌బెర్రీ చన్నా చాట్‌

సర్వింగ్‌: 2 నుంచి 3 పోర్షన్స్‌

కావాల్సిన పదార్థాలు:
1/2 కప్పు ఉడకబెట్టిన బఠాణీలు
1/2 కప్పు ఎండిన క్రాన్‌ బెర్రీస్‌
1/2 కప్పు ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు
1 టీ స్పూన్‌ తరిగిన ఉల్లిపాయలు
1 టీ స్పూన్‌ టమాటా ముక్కలు
1 టీ స్పూన్‌ పచ్చి మిర్చి
1 టీ స్పూన్‌ పచ్చి మామిడికాయ
1 టీ స్పూన్‌ కొత్తిమీర
బ్లాక్‌ సాల్ట్‌
1/2 టీ స్పూన్‌ చాట్‌ మసాలా
1 టీ స్పూన్‌ క్రాన్‌బెర్రీ ప్యూరీ
1 టీ స్పూన్‌ చింతపండు ప్యూరీ
పుదీన
1 టీ స్పూన్‌ దానిమ్మ గింజలు

1 టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌
1 టీ స్పూన్‌ బుజియా సేవ్‌

తయాు చేసే విధానం:
1. ఒక క్లీన్‌ బౌల్‌ తీసుకుని అందులో అన్ని పదార్థాలను తీసుకుని శుభ్రంగా
కలుపుకోవాలి.
2. కలుపుకున్న మిశ్రమానికి పక్కన పూరీలు, ఖాక్రా గార్నిష్‌గా వేసి సర్వ్‌
చేస్తే సరి.

3.మేతి-మలై యూఎస్‌ క్రాన్‌బెర్రీ చికెన్‌

సర్వింగ్‌: 2 పోర్షన్స్‌

కావాల్సిన పదార్థాలు:
2 బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు

మారినేడ్‌
1 కప్పు ఎండిన యూస్‌ క్రాన్‌బెర్రీస్‌
1 టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌
1/2 టీ స్పూన్‌ మెంతి పొడి

1 టీ స్పూన్‌ శనగపిండి
1 టీ స్పూన్‌ జీలకర్ పొడి
1 టీస్పూన్‌ కారం పొడి
1 టీ స్పూన్‌ గరమ్‌ మసాలా
1 టీ స్పూన్‌ క్రీమ్‌
1 టీ స్పూన్‌ పెరుగు
1 టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌

తయారు చేసే విధానం:
1. ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్‌ బ్రెస్ట్‌ ముక్కల్ని నీట్‌గా కడిగి పక్కన
పెట్టుకోవాలి.
2. మన దగ్గరున్న మసాలా దినుసుల్ని మొత్తం కలిపి.. ఆ మిశ్రమాన్ని చికెన్‌
ముక్కలకు దట్టించాలి
3. మసాలాలో నానబెట్టిన చికెన్‌ ముక్కల్ని దాదాపు 2 గంటలపాటు పక్కన
పెట్టేయాలి. ఆప్పుడే ఆ మిశ్రమం ముక్కలకు పడుతుంది.
4. ఒక ప్యాన్‌ తీసుకుని ఆయిల్‌ వేసి వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత
చికెన్‌ ముక్కల్ని చిన్న సెగపై దాదాపు 4 నిమిషాలు వేయించాలి.

5. ముక్కలు ఉడకడం స్టార్ట్‌ అయిన తర్వాత మన దగ్గరున్న మిగిలిన
మసాలా మిశ్రమాన్ని కూడా ప్యాన్‌లో వేసి వండుకోవాలి. దీనికి అరకప్పు
క్రీమ్‌, కప్పు వాటర్‌ కూడా పోసి.. చికెన్‌ ఉడికేవరకు సన్న సెగపై
వండుకోవాలి.
6. చికెన్‌ ఉడికితే కూర పూర్తైనట్లు. ఆ తర్వాత పొయ్యి కట్టేసి.. వేడి వేడి
కూరను సాస్‌తో సర్వ్‌ చేస్తే సరి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments