HomeNews400 సంవత్సరాల నాటి శాపం నుండి విముక్తి పొందిన మైసూరు మహారాజులు! శాపం వెనుక రియల్...

400 సంవత్సరాల నాటి శాపం నుండి విముక్తి పొందిన మైసూరు మహారాజులు! శాపం వెనుక రియల్ స్టోరీ తెలుసా?

ఎంత డబ్బు, బలం, బలగం ఉన్నా, సంతానం లేకపోవడం చాలా పెద్ద లోటు. అటువంటి లోటుతో 400 సంవత్సరాల నుంచి సతమతమవుతున్నారు మైసూరు మహారాజులు. వాళ్లకి అన్నీ ఉన్నాయి కాని, లంకంత ప్యాలస్ లో బోసి నవ్వులు నవ్వుతూ అల్లరి చేసే చిన్నారి లేదు. సంతానం కోసం రాజ దంపతులు ఎన్ని నోములు, వ్రతాలు చేసినా దైవం కరుణించలేదు. ఎంతటి మహారాజులు అయినప్పటికీ, వారి  వ్యక్తిగత జీవితంలో మనసుని పీడించే వేదనగా మిగిలింది.

అయితే 400 ఏళ్ల తరవాత ఆ భగవంతుడు వాళ్ళను కరుణించాడు. మైసూరు రాజవంశీకుడు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయర్,త్రిషిక కుమారి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. గతేడాది జూన్‌ 27న అంగరంగ వైభవంగా సాగిన వివాహమహోత్సవంలో వీరు ఒక్కటైన సంగతి తెలిసిందే. దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయర్‌– రాణి ప్రమోదాదేవికి యదువీర్‌ దత్త పుత్రుడు. త్రిషిక ఐదు నెలల గర్భిణి. దీంతో రాజమాత ప్రమోదాదేవి, రాజ కుటుంబం ఆనందంలో వెల్లివిరుస్తోంది.

అసలు ఈ రాజవంశీకులు ఎందుకు 400 ఏళ్ల గా ఇంతటి వేదన అనుభవిస్తున్నారు అనే దానిపై అలమేలమ్మ శాపమే కారణం అని కథనాలు ఉన్నాయి. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం…

క్రీ.శ. 1612లో తిరుమలరాజ మైసూరు సింహాసనం ఏలుతుండగా, రాజ ఒడెయర్‌ ఆయనపై తిరుగుబాటు చేసి రాజవుతాడు. దీంతో ఆవేదనకు గురైన తిరుమలరాజ భార్య అలమేలమ్మ కొన్ని ముఖ్యమైన ఆభరణాలను తీసుకుని తలకాడుకు వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఒడెయర్‌ సైనికులు ఆమెను చుట్టుముడతారు. ఆ సమయంలో అలమేలమ్మ తీవ్ర ఆగ్రహంతో… మైసూరు రాజులకు ఎప్పటికీ కడుపు పండదని శపించి కావేరి నదిలో దూకి తనువు చాలిస్తుంది.

నాలుగు వందల ఏళ్ల కిందట అలా శ్రీరంగపట్టణం రాజు శ్రీరంగరాయన (తిరుమలరాజ) భార్య అలమేలమ్మ శాపం వారికి ఉండటంతో మైసూరు సింహాసనాధీశులకు అన్ని సంపదలు ఉన్నా, సంతానభాగ్యం మాత్రం లేకుండా పోతోంది. దీంతో సమీప బంధువుల్లోని మగపిల్లల్ని దత్తత తీసుకుని వారసునిగా ప్రకటిస్తున్నారు. ఇంతకాలానికి చరిత్రకు భిన్నంగా రాజ దంపతుల కడుపు పండింది. మగపిల్లాడు పుడతాడని మైసూరు ప్యాలెస్‌ జ్యోతిష్యులు చెప్పినట్లు తెలుస్తుంది. ఇన్నేళ్ళకు  ఆ శాప విమోచన కలిగి, సంతాన ప్రాప్తిని ఆ దేవుడు కలిగించినందుకు….ఆనందంలో తేలుతున్నారు మైసూర్ రాజులు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments