ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ రూట్ మారుతోంది. వైద్యవృత్తిలో ఉన్న వ్యక్తులను తొలిసారిగా ఇది తాకింది. తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. మొట్టమొదటిసారిగా ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షిస్తే కరోనా పాజిటివ్ గా తేలినట్లు అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్ కి చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీ నుంచి రాగా.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దోమలగూడలో 43 ఏళ్ల వైద్యుడి నుంచి వైద్యురాలిగా ఉన్న ఆయన భార్యకూ వైరస్ సోకింది. మరోవైపు ఇప్పటికే వైరస్ సోకిన వారి నుంచి నమోదైన కేసులు (ప్రైమరీ కాంటాక్ట్) సంఖ్య 9కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో కలిపి తెలంగాణలో వైరస్ సోకిన వారి సంఖ్య 44కి చేరుకుంది. వారిలో ఒక వ్యక్తిని డిశ్చార్జి చేశారు.
తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా : ఇద్దరు డాక్టర్లకూ పాజిటివ్
RELATED ARTICLES