హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు మంగళవారంనాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎన్నికలు 3 విడతలుగా జరుగుతాయి. తొలి విడత జనవరి 21వ తేదీన 4480 గ్రామ పంచాయతీలకు, అలాగే రెండో విడత జనవరి 25వ తేదీన 4137 గ్రామ పంచాయతీలకు, మూడో విడతగా జనవరి 30వ తేదీన 4115 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఈ నోటిఫికేషన్‌లో తెలిపారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తామని, అందులో ప్రత్యేకంగా నోటా ఆఫ్షన్‌ను కూడా వుంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయని, అలాగే, ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
RELATED ARTICLES