ఏర్పేడు పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న వారిపైనుంచి భారీ లారీ దూసుకుపోయిన దుర్ఘటనలో 15మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈక్రమంలో లారీ డ్రైవర్ గురవయ్య సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం వెనుక ఇసుక మాఫియా ఉందంటూ మృతుల బంధువులు కొందరు సంఘటన స్థలంలోనే ఆరోపించారు. అలాగే ఏర్పేడులో అధికార పార్టీకి చెందిన ధనంజయులు నాయుడు ఇసుక మాఫియా దందా చేస్తున్న విషయాన్ని గ్రామస్థులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
ఇదిలాఉండగా లారీ డ్రైవర్ గురవయ్య వ్యవహార శైలి అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఘోరమైన ప్రమాదంలో ఇసుక మాఫియా ఏదైనా కుట్రపన్నిందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. లారీ యజమాని తాతంశెట్టి రమేష్‌కు టిడిపి నేతలతో ఉన్న సంబంధాలపై కూడా అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ నుంచి సున్నపురాయి తీసుకుని గురువారం రాత్రి 8 గంటలకు లారీ డ్రైవర్ గురవయ్య తమిళనాడుకు బయల్దేరాడు. ఇంతదూరం ప్రయాణించే డ్రైవర్‌కు సహాయకుడిగా క్లీనర్ లేకపోవడం, మరొక డ్రైవర్ కూడా లేకపోవడం, పైగా తమిళనాడుకు వెళ్ళాల్సిన వాహనం ఏర్పేడు మీదుగా ఎందుకు వెళ్లాల్సివచ్చిందనే విషయాలు
గురవయ్య మహబూబ్ నగర్‌నుంచి బయలుదేరి 17 గంటలు నిర్విరామంగా వాహనాన్ని నడపాడు. దీనికితోడు శుక్రవారం ఉదయం 8 గంటలకు మద్యం సేవించాడు. ఈ విషయాన్ని ఆర్‌టిఏ అధికారులు బ్రీత్ అనలైజర్ ద్వారా ధ్రువీకరించుకున్నారు. గురవయ్య రక్తంలో 287 ఎంజిని రీడింగ్‌లో చూపించింది. పైగా గురవయ్య వద్ద భారీ వాహనాలను నడిపేందుకు అవసరమైన లైసెన్స్ లేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే భారీ వాహనాలను అటు పోలీసులు, ఇటు ఆర్‌టిఏ అధికారులు తరచూ తనిఖీ చేస్తారు. ఆ సమయంలో భారీ వాహనం నడిపే గురవయ్యను ఎందుకు వదిలేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే గురవయ్య ఎక్కడికక్కడ డబ్బులు ముట్టజెప్పి కారు లైసెన్స్‌తోనే భారీ వాహనాన్ని నడిపేస్తున్నట్లు తెలుస్తుంది.
ఏర్పేడులో అధికార పార్టీకి చెందిన ధనంజయులు నాయుడు ఇసుక మాఫియా దందా చేస్తున్న విషయాన్ని గ్రామస్థులు బహిరంగంగానే చెప్పుకోగా, అదే పార్టీలో ఉన్న బాబు నాయుడు.. ధనంజయ నాయుడుకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరు సాగిస్తున్నారు. ఈక్రమంలో తనకు అడ్డులేకుండా చేసుకోవడానికి ఇసుక మాఫియా ఏదైనా కుట్రపన్నిందా అనే అనుమానం తలెత్తుతుంది.
ఏదేమైనా పోలీసు విచారణ తరవాత అన్ని విషయాలు బయటకి వస్తాయని కొందరు, డ్రైవర్ తాగి ఉండటం వలెనే అలా జరిగిందని మరి కొందరు అనుకుంటున్నారు.