సమస్యలపై ప్రశ్నిస్తే వెంటపడి దంచుడే..
తాండూరులో దాడికి నిరసనగా, నాగిరెడ్డిపేట బంద్
ఎల్లారెడ్డి/ప‌్రజాపక్షం : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఎన్నికల ప్రచారంలో గ్రామాలలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారాల గురించి ప్రశ్నించడం, నిలదీయడం వంటి సంఘటనలు ఎదురైతే, ఇతర గ్రామాల నుంచి ప్రత్యేకంగా ప్రచారానికి తన వెంట పెట్టుకున్న వారితో దాడి చేయిస్తున్నాడని అనడానికి బుధవారం తాండూరు గ్రామస్తులపై ఆయన కార్యకర్తలు వెంటపడి కొట్టి దాడి చేయడమే ఒక నిదర్శనం. కాగా గురువారం గాంధారి మండలం నేరేళ్ల తండాకు చెందిన మాజీ సర్పంచ్ నాయక్ ఇంటిలో తరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి గాయాలపాలు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. రవీందర్ మద్దతునివ్వను అన్నందుకే మా ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను కొట్టారని కిషన్ తెలిపారు
తాండూరులో తరిమి తరిమి కొట్టారు..
తాండూరు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆ గ్రామస్తులు సమస్యల పరిష్కారం గురించి అడిగిన పాపానికి ప్రశ్నించి నిలదీసిన వారిని పక్క గ్రామాల నుంచి వచ్చిన టిఆర్ నాయకులు, కార్యకర్తలు ఆ గ్రామ యువకులను ప్రజలను వెంటబడి కొట్టారు, నండూరు సంఘటన రాష్ట్రమంత ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో సంచలనమైంది. తాండూర్ గ్రామంలో గ్రామ యువకులు కొంత మంది ప్రజలు ఆ గ్రామ సమస్యలు, వ్యక్తిగత సమస్యలపై గ్రామంలో టిఆర్ ప్రచార రథానికి అడ్డుగా కూర్చొని రవీందర్ నిలదీశారు. దీంతో కోపోద్రిక్తులైన టిఆర్ కార్యకర్తలు అక్కడి స్థానికులపై దాడులు చేశారు.