న్యూఢిల్లీ : అన్ని రకాల ప్యాసింజర్ రైళ్ల సర్వీసుల రద్దును భారతీయ రైల్వేలు మే 3వ తేదీ వరకు పొడిగించాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించడంతో రైల్వేలు కూడా ప్యాసింజర్ రైళ్ల రద్దును పొడిగించాయి. రైళ్ల రద్దు నేపథ్యంలో టికెట్లు విక్రయించిన ఆన్‌లైన్ కస్టమర్లకు వంద శా తం డబ్బు ఆటోమేటిక్‌గా రిఫండ్ అవుతుందని, కౌం టర్ల వద్ద టికెట్లు విక్రయించిన వినియోగదారులు రిఫండ్‌ను జులై 31 వరకు పొందవచ్చని రైల్వేలు పేర్కొన్నాయి. ఇంకా రద్దు కాని రైళ్లలో అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకున్న వారు కూడా తమ టికెట్లను రద్దు చేసుకుంటే వంద శాతం డబ్బు రిఫండ్‌గా పొం దవచ్చని చెప్పాయి. కాగా, దేశంలో లాక్‌డౌన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రీమియం రైళ్లు, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రోరైళ్లు, కొంకన్ రైల్వే సహా భారతీయ రైల్వేలకు చెందిన అన్ని ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు రద్దు చేయాలని నిర్ణయించినట్లు రైల్వేలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. అయితే కరోనా నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో అవసరమైన సామాగ్రి, వస్తువులు,పార్సెల్ రైలు సర్వీసులు కొనసాగుతాయని తెలిపింది. అదే విధంగా అన్ని రైల్వే స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వెలుపల రిజర్వేషన్, రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేసేందుకు తీసుకోవాల్సిన టికెట్ల కోసం ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంట ర్లు కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరగు మూసివేయనున్నట్లు రైల్వేలు తెలిపాయి. రద్దు చేసిన రైళ్లలో టికె ట్లు తీసుకున్న వారికి పూర్తిగా డబ్బును వాపస్ ఇవ్వాలని అన్ని జోన్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇ ఎలాంటి ముందస్తు రిజర్వేషన్లు ఉండవని వెల్లడించింది. అయితే ఆన్‌లైన్ టికెట్ల రద్దు మాత్రం కొనసాగుతుందని చెప్పింది.
దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు : అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను మే 3వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్టు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభన నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను ప్రధాని మోడీ మే 3వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కూడా అన్ని విమాన సర్వీసులను రద్దు చేసింది. అయితే కరోనా నేపథ్యంలో ఆయా ప్రాం తాలకు అవసరమైన మం దులు, కిట్లు, ఇతర అత్యవసర సామాగ్రి సరఫరాకు కొన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వివిధ దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్రలతో పాటు ఇతర రక్షణ పరికరాల సరఫరాకు కొన్ని విమాన సర్వీసులు అందుబాటులో ఉంచారు. దేశీ య, అంతర్జాతీయ వాణిజ్య ప్యాసింజర్ విమానాల ను మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మే3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మంత్రిత్వశాఖ మంగళవారం ట్వీట్ చేసింది. అనంతరం మంత్రి హరిదీప్ సింగ్ మాట్లాడుతూ లాక్‌డౌన్ పొడిగించడాకి మంచి కారణాలున్నాయని చెప్పారు.మే 3వ తేదీ తరువాత దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలను ఎత్తివేసే చర్యలను పరిశీలిస్తామని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము అర్థం చేసుకుంటామన్నారు.
మే 3 వరకు అన్ని రైళ్లు, విమానాలు రద్దు
RELATED ARTICLES