తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు తిరుమల ముస్తాబవుతోంది. ఈనెల 18న వైకుంఠ ద్వార ప్రవేశానికి వేలాదిగా తరలిరానున్న భక్తుల కోసం టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గంటల సమయం క్యూలో వేచి ఉండే అవసరం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ప్రణాళికలు రూపొందించి భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అనుసంధానంగా నారాయణగిరి ఉద్యానవనంలో పెద్ద ఎత్తున షెడ్లను నిర్మిస్తున్నారు. జర్మన్ టెక్నాలజీతో 30 వేల మంది భక్తులు ఈ షెడ్లలో వేచి ఉండేలా వైకుంఠంకు అనుసంధానంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో షెడ్‌లో 2 వేలమంది భక్తులు వేచి ఉండేలా ఈ షెడ్లను నిర్మిస్తున్నారు. 18న వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం 17వ తేదీ ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 గంటల వరకు స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉండే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో 1.70 లక్షల మందికి మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది.
వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు
RELATED ARTICLES