ఫ్రీ, అన్‌లిమిటెడ్ అంటూ జియో సృష్టించిన సంచలనం మనదరికి తెలిసిందే. వ్యాపారానికి సరికొత్త నిర్వచనంలా మారిన ఈ రెండు పదాలను గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు చెందిన పానీ పూరీ వ్యాపారి రవి జగదాంబ తన పానీ పూరీ వ్యాపారానికి తగిలించి సరికొత్త ఒరవడి సృష్టించాడు. జియో ఆఫర్ల తో దూసుకుపోతున్న వ్యాపార సైలిని చూసి ఇన్స్పైర్ అయ్యి తన వ్యాపారానికి కూడా ఆ పద్దతిని అవలంభించాడు.
రోజుకు వంద రూపాయలు చెల్లించి అపరిమితంగా పానీపురి తినొచ్చని మొదటి ఆఫర్ పెట్టాడు. రెండవది మంత్లీ ప్లాన్‌లో భాగంగా రూ.1000 చెల్లించి అపరిమితంగా పానీ పూరీ తినవచ్చు. ప్లాన్లు ఒక్కటే కాదు, అతడి స్టాల్‌కు జియో స్టాల్ అని పేరు కూడా పెట్టేశాడు. ఈ ప్లాన్లు అమలు చేసిన తర్వాత తన వ్యాపారం జోరుగా సాగుతోందని, అనూహ్య స్పందన వస్తోందని రవి ఆనందగా తెలిపాడు.
మొత్తానికి ఫ్రీ, అన్‌లిమిటెడ్ అనే మాటలు ఎక్కడైనా సక్సెస్ బాట నడిపిస్తుందని నిరూపించారు జనం. వ్యాపారానికి ఈ రెండు మాటలు ఆయువుపట్టు అని అంబాని నుంచి పానీపూరి వ్యాపారి వరకు తెలుసుకుని ముందుకు దూసుకుపోతున్నారు.
జియో పుణ్యమా అని ఇది కూడా అపరిమితం…
RELATED ARTICLES