న్యూఢిల్లీ: చలికాలంలో తీహార్ జైల్లో ఖైదీలు పెరిగిపోతున్నారట. దాని కారణమేమంటే… వీధుల్లో ఉండటం కంటే.. తీహార్ జైల్లో ఉండటం మంచిదని కొందరు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్తన్నారట. దేశ రాజధాని ఢిల్లీలో ఇళ్లు లేని వాళ్లు ఎక్కువగా రహదారుల పక్కనే నిద్రపోతున్నారు. శీతాకాలంలో చలి ఎక్కువగా ఉండటంతో ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు ఇళ్లు లేని వాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. అలా చేసి తీహార్ జైల్లో కూర్చుందామని అనుకుంటున్నారు. 10,027 మంది సామర్థ్యం ఉన్న తీహార్ జైల్లో ప్రస్తుతం 16వేల మంది ఖైదీలు ఉన్నారు. చలికాలంలో జైల్లో ఉండటం కోసం కొంతమంది దొంగతనాలకు పాల్పడుతూ కావాలని పోలీసులకు పట్టుబడుతున్నారట. కొంతమంది ఖైదీలతో మా సిబ్బంది మాట్లాడిన సమయంలో ఈ విషయం బయటపడిందని తీహార్ జైలు అధికారి ఒకరు వెల్లడించారు. శీతాకాలంలో చలికి బయట ఉండటం కంటే జైల్లో ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది నేరాలు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.
చలికాలం తీహార్ జైలు ఫుల్
RELATED ARTICLES