హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, వాటిపై సమీక్షించుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతామని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రచారంతో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. పొత్తుల వల్లే ఓడిపోయామనేది సరికాదని, అయితే పొత్తులు విషయంలో కొంత ముందుగా నిర్ణయం తీసుకుంటే మరింత లాభం కలిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని ఆయన ఆరోపించారు. ఒక్క శాతం ఓట్ల తేడా ఉన్న నియోజకవర్గాల్లోనూ వివి ప్యాట్ స్లిప్‌లను లెక్కపెట్టలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో చోటుచేసుకున్న ఇలాంటి తప్పులను రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలు
RELATED ARTICLES