న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రబలిన కారణంగా 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో వ్యాధిని అదుపు చేసేందుకు కేంద్రం చర్యలను తీవ్రతరం చేసింది. బుధవారంనాడు కరోనాకు సంబంధించి వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబరు 9013151515ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా మోడీ వారణాసి నియోజకవర్గ ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, కరోనాను అదుపు చేసేందుకు వైద్యులు చేస్తున్న కృషిని అందరూ అభినందించాలని కోరారు. మహాభారత యుద్ధం 18 రోజుల్లో ముగిసిందని, కరోనా వైరస్‌ను కూడా 21 రోజుల్లో నియంత్రించాలని ప్రజలను కోరారు. లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనం ఇల్లు దాటి బయటకు రావద్దని మరోసారి కోరారు.
The WhatsApp helpline number is 9013151515; Mahabharata war lasted 18 days, war against coronavirus will take 21 days, the Prime Minister says.