కాంగ్రెస్ నేతల సన్నిహితులపై ఇడి దాడులు
మోడీది అసంబద్ధమైన పాలన
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపిని తిరస్కరించారు
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ
న్యూఢిల్లీ: యూపిఎ ఛైర్ పర్సన్ సోని యా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సన్నిహితులపై ఇడి దాడులు నిర్వహించడం పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తీవ్రంగా ఖండించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆయన అసంబద్ధమైన పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. శనివారం కాంగ్రెస్ నాయకు డు పవన్ ఖేరాతో కలిసి ఎఐసిసి కార్యాలయంలో సింఘ్వీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డా రు. బిజెపి వంటి తీవ్రవాద పరిపాలనను దేశంలో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. కాంగ్రెస్ బ్రిటిష్ సర్కారుతో నే పోరాటం చేసింది. అది బిజెపి కూడా బాగా తెలుసు. త్వరలోనే ఆ పార్టీకి తగ్గి న గుణపాఠం చెప్పేలా తీర్పు వస్తుం ది. ఇడి రాబర్ట్ వాద్రాకు సంబంధించిన ముగ్గురు సన్నిహితులపై దాడులు చేసి ంది. ప్రధాని మోడీ దర్యాప్తు సంస్థల ద్వారా దాడులు చేయించి కాంగ్రెస్ వి లువలను దిగజార్చి, తమ పార్టీని భ యపెట్టాలని చూస్తున్నారు. అందుకే తమ పార్టీకి చెందిన నేతల సన్నిహితులపై ఇడి ద్వారా దాడులు చేయిస్తున్నారు. ఇందుకోసం ఆయన అసంబద్ధమైన వి ధానాలను అవలంభిస్తున్నారు. ఇలాం టి చర్యలు వ్యక్తి యొక్క కీర్తీ ప్రతిష్టలను దెబ్బతీయడమే. కానీ, వారేం చే సిన.. అందులో మాత్రం నిజాలు లేవు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపిని ప్రజలు దారుణంగా తిరస్కరించారు. అందుకే ఆ పార్టీ ఆందోళనకు గురవుతుంది. గత ంలో డిఫెన్స డీల్‌లో లంచాలు తీసుకున్నారని ఆరోపిస్తూ.. శుక్రవారం ఇడి చట్ట విరుద్ధంగా కాం గ్రెస్ నేతలకు దగ్గరగా ఉండే ముగ్గురు ఇళ్లను సోదాలు చే సింది. అయితే వారు ఎవరనేది మాత్రం చెప్పాలనుకోవడం లేదు. కానీ,ఆ దాడులకు సంబంధించి ఎలాంటీ ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేసిందనే విషయాన్ని ఇడి చెప్పడం లేదు. ఎలాంటీ సర్చ్ వారెంట్‌ను జారీ చేయ్యలేదు. వారిని కలిసేందుకు న్యాయవాదులకు కూడా అనుమతినివ్వడం లేదు. నిర్బంధించిన వ్యక్తులను ఫిజికల్‌గా హ్యాండిల్ చేసినట్లు తెలుస్తోంది. బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటీ కొత్త పంథాను అనుసరిస్తోంది. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతోనే ప్రధాని మోడీ ఇలాంటీ విధానాలను అవలంభిస్తున్నారంటూ సింఘ్వీ ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి పార్టీపై విమర్శలు గుప్పించారు.