శ్రీనగర్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. దేశం ‘ఒడిఒఎంఒఎస్ (ఒడోమాస్)’ తో తీవ్రంగా బాధపడుతోందని ఎద్దేవా చేశారు. ‘మిగతా దేశం మొత్తం ఒడిఒఎంఒఎస్‌తో బాధపడుతోంది. దానికి అర్థం ఓవర్ డోస్ ఆఫ్ ఓన్లీ మోడీ ఓన్లీ షా (మోడీ, షా డోస్ ఎక్కువగా ఉంది)’ అని అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో ర్యాలీ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒన్ ర్యాంకు ఒన్ పెన్షన్(ఒఆర్ఒపి) హామీని అమలు చేసింది. కాంగ్రెస్ మాత్రం దేశానికి ‘ఓన్లీ రాహుల్ ఓన్లీ ప్రియాంక (ఒఆర్ఒపి)ని ఇచ్చింది’ అంటూ కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు.
దేశం ‘ఒడిఒఎంఒఎస్’తో బాధపడుతోంది
RELATED ARTICLES