ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యమైన రీతిలో 333కి పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ ప్రకారం, తెలంగాణలో ఆదివారం మరో 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 333కి పెరిగింది. ఇప్పటి వరకు 11 మంది మరణించగా.. 32 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 289 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో 333కి పెరిగిన కేసులు
RELATED ARTICLES