ఖమ్మం : తెలంగాణ ఎన్నికలు దేశ భవిష్యత్‌కు ఎంతో కీలకమైనవని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఖమ్మంలో ప్రజా కూటమి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. సభకు వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే.. తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి రావడం తథ్యమనిపిస్తోందని రాహుల్ ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్రంలో మోడీ ఒక్కో వ్యవస్థను నాశనం చేస్తూ వస్తున్నారని.. సుప్రీంకోర్టు, సీబీఐ, ఆర్బీఐ, ఈసీ.. ఇలా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ‘తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒకవైపు ఉంది. రైతులు, యువకులు, ప్రజలు మరోవైపు ఉన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి గెలిచిన తర్వాత.. దేశంలో మోడీపై పోరాడేందుకు ఇదే కూటమి దిక్సూచిగా నిలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో మోడీకి సంబందించిన బి-టీమ్‌తో మనం పోటీ పడుతున్నాం. మోడీ బి-టీమ్ అయిన టిఆర్ఎస్‌ను ఓడించాలి. ఆ తర్వాత కేంద్రంలో మోడీ ఎ-టీమ్‌ను ఓడిద్దాం.’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోయినప్పుడు.. తెలంగాణ, ఆంధ్రాకు కేంద్రం విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకిచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. తెలంగాణకు, ఆంధ్రాకు ఇచ్చిన హామీలను మోడీ సర్కారు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపించారు. టిఆర్ఎస్.. బిజెపికి మద్దతు ఇస్తున్నప్పటికీ.. ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. విభజన చట్టంలోని ఏ ఒక్కహామీనీ నెరవేర్చని మోడీని కెసిఆర్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజాకూటమి దేశానికే దిక్సూచి
RELATED ARTICLES