HomeNewsBreaking Newsతెలంగాణలో ఏప్రిల్ 16 వ‌ర‌కు లాక్‌డౌన్‌

తెలంగాణలో ఏప్రిల్ 16 వ‌ర‌కు లాక్‌డౌన్‌

ప్ర‌జాప‌క్షం/హైదరాబాద్ : తెలంగాణలో క‌రోనా వైర‌స్ ప్ర‌మాదం మ‌రింత పెరిగే అవ‌కాశాలు వుండ‌టంతో, దాన్ని నియంత్రించే ప్ర‌క్రియ‌లో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మ‌రో రెండు వారాల‌పాటు పొడిగించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తాజాగా విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 16వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు సిఎం కెసిఆర్ డిక్లేర్ చేసిన‌ట్లుగా ఈ బులిటెన్ తెలిపింది. మ‌రో 21 రోజుల‌పాటు లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారంనాడు ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే. దేశ‌వ్యాప్తంగా ఏప్రిల్ 16 వ‌ర‌కు ఈ లాక్‌డౌన్ వుంటుంది. తెలంగాణ‌కు కూడా ఇదే వ‌ర్తిస్తుంది. ఈలోగా క‌రోనాను మ‌రింత అదుపు చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని కెసిఆర్ ఆదేశించారు. ప్ర‌జ‌లంతా లాక్‌డౌన్ సంద‌ర్భంగా స‌హ‌క‌రించాల‌ని, రాత్రి 7 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు. ప‌గ‌టిపూట కూడా అత్యంత అవ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని, అది కూడా ఒక‌రికి మించి రావ‌ద్ద‌ని కోరారు. కూర‌గాయ‌ల‌ను కూడా కాల‌నీల‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. వైద్య‌వృత్తిలో ఉన్న వ్య‌క్తుల‌ను క‌రోనా తొలిసారిగా తాకిన విష‌యం తెల్సిందే. తాజాగా మరో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. మొట్ట‌మొద‌టిసారిగా ఇద్దరు వైద్యులతో పాటు మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యుల నమూనాలు పరీక్షిస్తే కరోనా పాజిటివ్ గా తేలినట్లు అధికారులు తెలిపారు. కుత్బుల్లాపూర్ కి చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీ నుంచి రాగా.. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకూ పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దోమలగూడలో 43 ఏళ్ల వైద్యుడి నుంచి వైద్యురాలిగా ఉన్న ఆయన భార్యకూ వైరస్ సోకింది. మరోవైపు ఇప్పటికే వైరస్ సోకిన వారి నుంచి నమోదైన కేసులు (ప్రైమరీ కాంటాక్ట్) సంఖ్య 9కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో కలిపి తెలంగాణలో వైరస్ సోకిన వారి సంఖ్య 44కి చేరుకుంది. వారిలో ఒక వ్య‌క్తిని డిశ్చార్జి చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments