HomeNewsBreaking Newsఏప్రిల్ 15 వరకు లాక్‌డౌన్ : కెసిఆర్‌

ఏప్రిల్ 15 వరకు లాక్‌డౌన్ : కెసిఆర్‌

ప్ర‌జాప‌క్షం/హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ వుంటుంద‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు శుక్ర‌వారంనాడు ప్ర‌క‌టించారు. అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశానంత‌రం కెసిఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు. లాక్‌డౌన్‌ను కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించిన నేప‌థ్యంలో రాష్ట్రంలో క‌రోనా అదుపున‌కు చ‌ర్య‌ల‌ను మ‌రింత ఉధృతం చేసేందుకు మ‌రో 16 రోజుల‌పాటు అంటే ఏప్రిల్ 15వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను కొన‌సాగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని కెసిఆర్ తెలిపారు. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌లు మ‌రింత సంయ‌మ‌నంతో, జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. “కూరగాయలకు ఒక్కసారి పోవద్దు. దయచేసి, ప్రజాప్రతినిధులు కూడా గుంపులు గంపులు గా వెళ్లవద్దు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలికి గురికావద్దు. ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం కు వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు,హౌస్ బిల్డింగ్ కాకుండా ఇరిగేషన్ లో, రైస్ మిల్ లలో కూడా ఎక్కడి నుండో వచ్చి పని చేస్తారు. వారికి మేము విజ్ఞప్తి చేశాం. వారికి కూలీలు ఇవ్వాలని,అన్నం కూడా పెట్టాలని చెప్పారు .అంతేకాదు మున్సిపల్ మంత్రి తో క్రేడ్డాయ్ వాళ్ళు కలిసి అన్నివిధాలా ఆదుకుంటాం అన్నారు. కలెక్టర్ లకు కూడా చెప్తున్నా అందరిని ఆదుకోవాలని కోరుతున్న.ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న కార్పోరేషన్ లలో చాలా మంది కూలీలు ఉన్నారు వారికి అందరికి అండగా ఉండాలి కోరుతున్నాం. వారిని ప్రభుత్వం ఆదుకోండి. మున్సిపల్ శాఖ మంత్రి తో సమన్వయం చేసుకొని ఉండాలి. హాస్టల్ విద్యార్థులు హాస్టల్ విద్యార్తులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి హాస్టల్ లు మూసివేయడం లేదు. పేదలు,బిక్షగాళ్ళు,అణధాశ్రమ లలో ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పశుగ్రాసం, పాల ,నిత్యావసర వాహనాలు తిరుగాలి, డైరీ పామ్ ఓనర్ లు మీకు ఎవరు సప్లై చేశారో వారితో మీరు సంప్రదించి తెప్పించుకోవచ్చు. పౌల్ట్రీ ఉత్పత్తులు కూడా రావాలి కాబట్టి రానివ్వాలి” అని అన్నారు.

చికెన్ పై దుర్మార్గుల దుష్ర్ప‌చారం

“చికెన్ తింటే వైరస్ వస్తుంది అని కొంత మంది దుర్మార్గులు ప్రచారం చేశారు. కానీ చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అంతేకాదు బత్తాయి, సంత్రా, ఇతర సి విటమిన్ ఉండే ప్రోడక్ట్స్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పండ్ల వాహనాలకు ప్రత్యేక పాస్ లు ఇవ్వాలి వాటిని అన్నింటిని కూడా హైదరాబాద్ కు తెప్పించాలి. ఎగ్స్ కూడా తినాలి , ఆ వాహనాలను కూడా అనుమతి ఇవ్వాలి. 50 లక్షల ఎకరాల్లో పంట సాగు ఉంది, పంట కోత జరగాలి. హార్వెస్టార్ అందుబాటులో ఉన్నాయి, పంట అమ్ముకోవాలి. ప్రపంచ మొత్తం యుద్ధం లో ఉంది. ఎప్పుడైనా చూశామా ఓల్డ్ సిటీ లో తప్ప ఎక్కడైనా చూశామా కర్ఫ్యూ. రైతులకు దయచేసి విజ్ఞప్తి నాది ముందు నిది ముందుకాదు ఒక్కరి తరువాత ఒక్కరు కొనుకోవచ్చు. ఐకెపి కేంద్రాలు పెట్టరు, వ్యవసాయ శాఖ అధికారులు అందరూ గ్రామాల్లో ఉంటారు. మీరు అంత ఆగమాగం చేయావద్దు. పంట కొనేందుకు అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తోంది. మీరు పండించిన పంట మొత్తం ప్రభుత్వం కొంటుంది మీకు చెక్ లు ఇస్తాం మీరు వచ్చేవారు బ్యాంక్ ఖాతాలు తేవాలి. మీ డబ్బులు ఎటుపోవు,కొంత అటు ఇటు మీ ఖాతాలో పడతాయి. మీ ధాన్యం గోదాం లలో పెడుతాం, అవ్వి కూడా సరిపోకపోతే ప్రభుత్వ స్కూల్ లలో పెడుతాం. ప్రతి గింజను మద్దతు ధర కు కొనుగొలు చేస్తాం. ప్రైవేట్ వ్యాపారులు కూడా కొనుకోవచ్చు కానీ మద్దతు ధర ఇవ్వాలి. ఊర్లలో వేసిన కంచెలను కూడా తొలగించాలి ,ఎందుకంటే మీ ఊరు పంటలు కొనాలి అంటే లారీలు రావాలి ఇంకా ఇతర రవాణా సరుకులు కూడా రావాలి” అని కెసిఆర్ చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments