ప్రజాపక్షం/హైదరాబాద్ : ఏప్రిల్ 14వ తేదీ వరకు తెలంగాణ కోర్టులు లాక్‌డౌన్‌లోనే వుంటాయి. తెలంగాణలో న్యాయ వ్యవస్థ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు పొడిగించారు. రాష్ట్రంలో కోర్టులన్నీ ఏప్రిల్ 14 లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు లాక్‌డౌన్‌లోనే ఉండాలని హైకోర్టు ఆదేశించింది. న్యాయ శాఖ ఉద్యోగులు ఇళ్లల్లోనే అందుబాటులో ఉండాలని సూచించింది. అత్యవసర అంశాల కోసం జడ్జిలు, మెజిస్ట్రేట్ లు రొటేషన్ పై విధుల్లో ఉండాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. రిమాండ్, బెయిల్ వంటివి వీడియో కాన్ఫరెన్స్ లేదా స్కైప్ ద్వారా చేపట్టాలని ఆదేశించింది. అత్యవసర పిటిషన్లను ఈ-మెయిల్ ద్వారా దాఖలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఏప్రిల్ 14 వరకు తెలంగాణ కోర్టులు లాక్‌డౌన్‌లోనే!
RELATED ARTICLES