ప్రజాపక్షం/మహబూబ్ బ్యూరోః తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. బిఎస్‌పి తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, ఏ పార్టీతోను పొత్తులు పెట్టుకోలేదని తెలిపారు. అన్ని వర్గాల వారికి టికెట్ల కేటాయింపులో సమాన అవకాశం ఇవ్వడ జరిగిందని తెలిపారు. ఇప్పటికి కూడా దళిత ఆదివాసీ, ముస్లీం, అగ్రవర్ణ పేదలకు అభివృద్ది ఫలాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఆదివాసీలకు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను అమలు చేయడంలేదని దీన్ని మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోలోపల కలిసి కుట్ర చేసి రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. ప్రతిదీ ప్రయివేటు రంగంలోకి మారుస్తూ అగ్రవర్ణాలకు అవకాశాలు వచ్చేలా చేస్తున్నాయని విమర్శించారు. మండల్ కమిషన్ రిపోర్టు కోసం బీఎస్పీ ఎంతో కృషి, ఎంతో పోరాటం చేసిందని తెలిపారు. విపి సింగ్ మండల్ కమిషన్ అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి సపోర్టును వెనక్కి తీసుకుందని విమర్శించారు. ముస్లిం మైనారిటీలకు కూడా ఎన్నో అవమానాలు అన్యాయం జరుగుతున్నా సచార్ కమిటి రిపోర్టు అమలు చేయడం లేదన్నారు.
తీవ్ర నిరాశలో తెలంగాణలో రైతులు!
RELATED ARTICLES