అమరావతి: తెలుగుదేశం పార్టీ.. ఇతర రాష్ట్రాల్లోనూ పోటీకి సిద్ధమవుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలపై దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో పొరుగు రాష్ట్రం ఒడిశాలో పోటీకి సిద్ధమవుతూ పార్టీ బలోపేతంపై కసరత్తు ప్రారంభించింది. ఒడిశాలోని బరంపురం, కటక్, రాయగడ, కోరాపుట్ ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పోటీ చేయాలంటూ ఎప్పటి నుంచో స్థానికుల నుంచి టిడిపికి వినతులు వెల్లువెత్తుతున్నాయి. 1999 వరద సమయంలో తీర ప్రాంత ప్రజలను ఆదుకోవడంలో సిఎంగా ఉన్న చంద్రబాబు ఎంతో చొరవ చూపించారు. అప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో టిడిపి పట్ల సానుభూతి ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లోని దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ సిద్ధమవుతోంది. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న రాయగడ, కోరాపుట్, మల్కన్‌గిరి, గజపతి, గంజాం, నవరంగపూర్ జిల్లాల్లో టిడిపి పోటీ చేసే అవకాశాలున్నాయి. 2000 సంవత్సరంలోనే ఒడిశాలో పోటీ చేయాల్సిందని.. 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ఒడిశాకు చెందిన టిడిపి నేత రాజేశ్ పుత్ర తెలిపారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి సర్వే జరుగుతోందని, 147 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నామని రాజేశ్‌పుత్ర వివరించారు.
ఒడిశా ఎన్నికల బరిలో టిడిపి
RELATED ARTICLES