ప్రజాపక్షం/హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల పేదల పరిస్థితి హృదయ విదారకంగా మారిందని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. పేదల దుస్థితి ప్రధాని నరేంద్ర మోడీ హృదయాన్ని కదలించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో హృదయాన్ని కదిలించే పేదల దుస్థితికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇప్పటికీ కూడా దేశంలో సరైన సహాయక చర్యలు లేవని, ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ప్రతిబింబిస్తుందని అన్నారు. ఆర్థిక ప్యాకేజీ కార్పోరేట్ల వైపు మొగ్గు చూపడం కాదు సామాన్య ప్రజలకు సంబంధించి ఉండాలని ఆయనన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పునరావాస కేంద్రాన్ని, ఆహార శిబిరాన్నైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు.
లాక్‌డౌన్‌తో హృదయవిదారకంగా పేదల పరిస్థితి
RELATED ARTICLES