న్యూఢిల్లీ: సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఐపిఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే వారం విచారణ చేపట్టనుంది. సిబిఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్ వర్మను ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని అత్యున్నత స్థాయి సంఘం తొలగించింది. అనంతరం ప్రభుత్వం అదనపు డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించింది. ఇది సరికాదంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో పాటు, సమాచార హక్కు చట్టం కార్యకర్త అంజలి భరద్వాజ్ సోమవారం సుప్రీంకోర్టులు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో కూడిన ఉన్నత స్థాయి సంఘం డైరెక్టర్‌ను నియమించాల్సి ఉండగా, ఆ నిబంధనను ఏ మాత్రం పాటించలేదని వారి తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించిన అన్ని పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా కేంద్రాన్ని ఆదేశించాలని కూడా కోరారు.
నాగేశ్వరరావు నియామకంపై విచారణకు సుప్రీం ఒకె
RELATED ARTICLES