తంగల్లపల్లి : ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుమారుడు, తాజా మాజీ మంత్రి కె.టి.ఆర్‌కూ నిరసనల సెగ తప్పడం లేదు. తాజాగా కెటిఆర్ సభలో నేరెళ్ల బాధితులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల హరీష్, బట్టు బానయ్య అనే బాధితులు ఈ నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగల్లపల్లి మండలంలో కెటిఆర్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.
https://youtu.be/hGZZfTAd9Uw