ప్రజాపక్షం/న్యూఢిల్లీ : దేశంలో మానవ హక్కుల కార్యకర్తలు ఎదుర్కొంటున్న వేధింపులను తక్షణమే ఆపాలని సిపిఐ శనివారంనాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం ఒక ప్రకటన విడుదల చేసింది. మానవ హక్కుల కార్యకర్తలకు సంబంధించి బహింరంగా, రహస్యంగా జరిగే అన్ని రూపాల వేధింపులను ఆపుచేయాలని కోరింది. జమ్మూకశ్మీర్‌లో హోంమంత్రి అమిత్‌షా, అతని మంత్రిత్వశాఖ కొత్త చట్టాలు ప్రకటించిన తీరును చూస్తున్నామని, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు తన స్వంత ఎజెండాను రుద్దడానికి కొవిడ్19ను ఒక అవకాశంగా పరిగణించకూడదని అభిప్రాయపడింది. మానవహక్కుల కార్యకర్తలు ఆనంద్ తెల్‌తుంబ్డే, గౌతమ్ నవలఖాలకు సుప్రీంకోర్టు ఒక వారం సమయం అవకాశం ఇచ్చిందని, అయితే యావద్దేశం డాక్టర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్న వేళ భీమా కొరెగాంవ్ ఏసులో అధికారుల ముందు లొంగిపోవాలని వారికి ఇచ్చిన సమయం ఏప్రిల్ 13వ తేదీ నాటితో ముగియబోతున్నదని సిపిఐ గుర్తుచేసింది. కానీ డాక్టర్ తెల్‌తుంబ్డే, ఇతర కార్యకర్తల పట్ల కొనసాగుతున్న వేధింపులు దళితులు, ఆదివాసీలు, ఒబిసిలు, మైనారిటీ కమ్యూనిటీల ప్రయోజనాల కోసం నిబద్ధతతో కృషి చేస్తున్న మేధావులందరికీ ఒక హెచ్చరిక అని పేర్కొంది. మరో తొమ్మిది మంది హక్కుల కార్యకర్తలు, మేధావులు కూడా ఇదే కేసులో నిందితులుగా వున్నారు. యుఎపిఎ (అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్)లోని వివిధ సెక్షన్ల కింద అరెస్టయిన వీరంతా 2018 నుంచి జైలులో మగ్గుతున్నారు. భీమా కొరెగాంవ్ కేసును గత బిజెపి సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తీరు చూశామని, కేంద్ర ప్రభుత్వం దీనిపై సిట్‌ను ఏర్పాటు చేయనేలేదని గుర్తుచేసింది. దీన్ని బట్టి చూస్తే మిలింద్ ఏక్‌బోటే, మనోహర్ భిడేల నాయకత్వంలోని హిందుత్వ శక్తులకు చట్టం రక్షణ కల్పిస్తున్నదన్న భయాలు వ్యక్తమవుతున్నాయని తెలిపింది. మానవహక్కుల కార్యకర్తలపై నమోదైన జాతివ్యతిరేక, కుట్ర కేసులన్నింటినీ ప్రభుత్వం నిలుపుదల చేయాలని, భీమా కొరెగాంవ్ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారి పట్ల, అరెస్టు కాబోతున్న వారి పట్ల వేధింపులు ఆపాలని సిపిఐ కోరింది. ప్రభుత్వం కేసులను ఉపసంహరించి, వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
Stop Harassing Human Rights Activists: CPI
The National Secretariat of the Communist party of India issued the following statement today (April 11, 2020) asking the government to stop all kinds of harassment of human rights activists:
The National Secretariat of the Communist Party of India asks the government to stop all kinds of harassment overt and or covert of human rights activists.
COVID-19 should not be treated as a blessing in disguise for BJP and RSS to push their agenda as we saw how the Union home minister Amit Shah and his ministry announced a new set of domicile laws for Jammu and Kashmir.
The Supreme Court has given activists Anand Teltumbde and Gautam Navlakhaa a week’s time, which comes to an end on April 13, to surrender before the authorities in the Bhima-Koregaon case, on a day when the whole country will remember Dr. Ambedkar on his birthday.
The harassment of Dr. Teltumbde and other activists continues to be a warning to all intellectuals who emerged from and stand committed for the cause of Dalits, Adivasis, OBCs and minority communities. Nine other activists and intellectuals who have been accused in the same case and charged with sections of the draconian Unlawful Activities Prevention Act (UAPA) have been imprisoned since 2018.
The way Bhima-Koregaon case was handled by the previous state government of Maharashtra headed by BJP and the Union government not setting up an SIT has raised strong apprehension that Hindutva brigade led by Milind Ekbote and Manohar Bhide are being shielded from prosecution.
CPI urges upon the government to put on hold all alleged anti-national and conspiracy cases against human rights activists. In this context, the Party wants the government to stop harassment of activists arrested already and others to be arrested in Bhima-Koregaon case.
The Party wants the government to withdraw the case and release all the activists.