మ్యాడ్రిడ్ : రాజులకే దిక్కులేదు…ఇక సామాన్యులెంత? అంటే ఇదే మరి! కరోనా స్పెయిన్ రాకుమారి ప్రాణాలను తీసింది. కరోనా వైరస్ కబళిస్తున్న స్పెయిన్‌లో ఆ దేశ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మరణించినట్లు ప్రకటన విడుదలైంది. యువరాణి మరియా థెరిసా(86)కు కరోనా సోకడంతో కన్నుమూసినట్లు ఆమె సోదరుడు ప్రిన్స్ ఎన్రిక్ డి బోర్బన్ ఫేస్ బుక్ వేదికగా ప్రకటించారు. అయితే ఈ సమాచారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారమే ఆమె అంత్యక్రియలు పూర్తయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రపంచంలో ఒక రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కరోనా వల్ల మరణించడం ఇదే తొలిసారి.
స్పెయిన్‌లో 6528 మంది మృత్యువాత
ఐరోపా దేశాల్లో ఇటలీ తర్వాత స్పెయిన్ లోనే కరోనా కల్లోలం అత్యధికంగా ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 78,797 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 14709 మంది కోలుకోగా.. మరో 6528 మంది మృత్యువాతపడ్డారు.
స్పెయిన్ రాకుమారిని కబళించిన కరోనా
RELATED ARTICLES